Devatha July 7 Today Episode: ఈరోజు ఎపిసోడ్లో మాధవ దగ్గరికి దేవి వచ్చి చెయ్యి చాపమని అంటుంది. దాంతో మాధవ తన చేతి మీద స్కెచ్ పోవటంతో ఎక్కడ దేవి చూసి గుర్తు పడుతుందో అని దేవిని కళ్ళు మూసుకోమని చెప్పి తను వెంటనే వెళ్లి స్కెచ్ తో పేరు రాసుకుంటాడు. ఇక దేవి కళ్ళు తెరిచి చెయ్యి చాపమనడంతో చెయ్యి చాపుతాడు. ఇక దేవి భాగ్యమ్మ అవ్వ జామకాయలు ఇచ్చింది అని మాధవకి ఇవ్వటంతో వెంటనే మాధవ తన మనసులో రాధ ఒక్కొక్కరిని దేవికి దగ్గర చేస్తుంది అని అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే..
రాధ.. ఆదిత్య తనని కూడా స్కూల్ దగ్గరికి తీసుకెళ్తాడు అని నేనెందుకు అని ఆలోచిస్తుంది. అప్పుడే దేవి, మాధవ కూడా అక్కడికి రావటంతో వెంటనే రాధ ఇవాళ ఆఫీసర్ సారు స్కూల్లో జాయిన్ చేస్తా అన్నాడు కదా నన్ను కూడా రమ్మన్నాడు అని అనటంతో వెంటనే మాధవ సీరియస్ గా కాకుండా వెటకారంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తాడు. నువ్వు కూడా వెళ్ళు రాధ అంటూ కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు.
ఇలా వెళ్తావా అని.. మంచిగా రెడీ అవ్వు అంటూ.. నీకు తెలుసు కదా ఆఫీసర్ సార్ తోని ఎలా వెళ్లాలో అని అనడంతో వెంటనే రాధ షాక్ అవుతుంది. అంతేకాకుండా ఆదిత్య కు ఫోన్ చేసి కాస్త ఆలస్యంగానే రమ్మని తొందరేమీ లేదు అని అంటాడు. దేవి అదేంటి నాయన.. ఆఫీసర్ సర్ వస్తే కాసేపు తనతో మాట్లాడుతాను కదా అని అనటంతో మాధవ అది కాదమ్మా.. ఆఫీసర్ సార్ వస్తే బయట ఎదురు చూస్తూ ఉండాలి.. అప్పటివరకు మీ అమ్మ ఆగకుండా వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది అని అంటాడు.
కూతుర్ని స్కూల్లో జాయిన్ చేసిన ఆదిత్య..
దాంతో రాధ ఏమి అనకుండా లోపలికి వెళ్లి రెడీ అవుతుంది. ఇక ఆదిత్య కారులో వస్తూ రాధ తనతో మాట్లాడిన మాటలను.. గుర్తుకు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత రాధ తో సహా దేవిని తీసుకొని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తాడు. అక్కడ స్కూల్లో ఉన్న మేడమ్ దేవితో నువ్వు కూడా మీ డాడీ లాగా కలెక్టర్ అవ్వాలనుకుంటున్నావా అని అంటుంది. ఇక ప్రతిసారి దేవిని ఆదిత్య కూతురు అనటంతో వెంటనే దేవి ఆయన తన తండ్రి కాదు అని.. స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాడు అని అంటుంది.

Devatha July 7 Today Episode: మాధవలో మార్పు వచ్చిందంటున్న రాధ..
ఇక మాధవ రాధ ఫోటో చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక జానకి వచ్చి రాధలో మార్పు వచ్చింది అని అంటుంది. మరోవైపు రాధ, ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాధవ సారులో మార్పు వచ్చింది అని.. ఆయన ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని అందుకే అలా మాట్లాడుతున్నాడు అని అంటుంది.