Devatha June 1 Episode: ఈరోజు ఎపిసోడ్ లో సత్య కమల దగ్గరికి వచ్చి బయటికి వెళుతున్నాను అని అంటుంది. ఈ విషయం ఆదిత్యకు చెప్పమని అంటుంది. ఇక కమల కూడా తనని చూసి సత్య ఎక్కడ బాధపడుతుందో అనుకొని తన ఇంటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. కానీ సత్య అలా ఏం కాదు నువ్వు ఇక్కడ ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటుంది.
సీన్ కట్ చేస్తే..
జానకి రామమూర్తితో రాధ ప్రవర్తన బాలేదు అని అలా చెప్పకుండా పెళ్లి సంబంధం ఎలా చూస్తుంది అని కోపంతో మాట్లాడుతుంది. అంతేకాకుండా మాధవ కు రాధ అంటే ఇష్టమని అయినా కూడా బయట సంబంధం చూసింది అని అంటుంది. దాంతో రామమూర్తి అందులో రాధ తప్పు లేదు అంటూ తను మొదట నుండి అలాగే ఉంది అని అలా అని మనం కోడలిగా చేసుకోవడం స్వార్థం అవుతుందని అంటాడు.
మరోవైపు కమల దగ్గరికి ఆదిత్య సత్య బయటికి వెళ్ళింది అని చెబుతుంది. ఆదిత్య ఓ చోట కూర్చుని దేవి ఫోటోలు చూసుకుంటూ రాధను తలచుకుంటాడు. ఆరోజు ఇంట్లో నుంచి వెళ్లకపోతే ఇప్పుడు చాలా సంతోషంగా కలిసిపోయి ఉండేవాళ్ళం అని అనుకుంటూ బాధపడతాడు.
సత్య మాటలకు షాక్ లో ఉన్న రాధ..
ఇక రాధ జానకి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ కోపంతో కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి సత్య రావటంతో తనతో కాసేపు మాట్లాడుతుంది. కమల గురించి అడగటంతో బాగానే ఉంది అని చెప్పి తాను బాధపడుతుంది. తనకు అమ్మ అయ్యే అదృష్టం లేదు అని తన అక్క రాధకు చెప్పటంతో రాధ షాక్ అయ్యి బాధపడుతుంది.
సత్యను దగ్గరికి తీసుకొని ఏమి కాదు అని ధైర్యం ఇస్తుంది. ఇక సత్య కూడా తన అత్త చాలా మంచిగా చూసుకుంటుంది అని వేరే వాళ్లు అయితే బాధ పెట్టే వాళ్ళు అని అంటుంది. ఇక రాధ ఆ విషయం గురించి ఆలోచించకుండా ఉండమని ధైర్యం చెబుతుంది. అంతేకాకుండా తన మనసులో నా బిడ్డ నీ బిడ్డనే అని త్వరలో కలిసి పోతాము అని అనుకుంటుంది.

Devatha June 1 Episode: రాధకు అడ్డుగా ఉన్న చిన్మయి..
మరోవైపు భాగ్యమ్మ తన ఇద్దరి కూతుళ్ల పరిస్థితి అలా కావడంతో తట్టుకోలేక బాధ పడుతుంది. తన కూతుర్లు ఇటువంటి బాధలు మోస్తున్నారని ఏడుస్తుంది. ఇక రాధ వంటగదిలో ఉండగా అక్కడికి చిన్మయి వచ్చి ఎందుకు ఇలా ఉంటున్నావు అమ్మ అని అంటుంది. దాంతో రాధ ఏమీ లేదు అని సరిదిద్దుకుంటుంది. ఇక అక్కడి నుంచి చిన్మయి వెళ్ళాక ఇంట్లోకి నుంచి బయటికి వెళ్దాము అంటే నీతో నా బంధం మరింత బలంగా ఉంది అని బాధపడుతుంది.
తరువాయి భాగం లో సత్య రాధ ఇంటికి వెళ్లాను అని ఆదిత్య చెప్పటంతో వెంటనే ఆదిత్య రాధే మీ అక్క రుక్మిణి అని తెలిసి వెళ్తున్నావు కదా అని అనటంతో సత్య ఒకేసారి షాక్ అవుతుంది.అంతేకాకుండా ఆ విషయం తనకు కూడా తెలుసు అని అనడం తో మరింత షాక్ కు గురి అవుతుంది.