Devatha June 15 Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకాలం చనిపోయింది అనుకున్న రుక్మిణిని గోడకి ఫోటో వేసి దండ వేశాం. కానీ రుక్మిణి శవాన్ని మాత్రం ఎవరు చూడలేదు. పూజారి చెప్పిన మాటలు బట్టి, రుక్మిణి ఎక్కడో ఒకచోట బ్రతికే ఉంది అని అంటుంది దేవుడమ్మ.
కఠినమైన నిర్ణయం తీసుకున్న దేవుడమ్మ..
రుక్మిణి దొరికేవరకు ఉపవాసం ఉంటాను అని పూజారి చెప్పినట్లు దీక్ష చేస్తాను అనటంతో ఈశ్వర్ ప్రసాద్ నీ ప్రాణాలు అలా అడ్డు పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. కానీ దేవుడమ్మ మాత్రం దేవుడి చూపు తో పాటు మన వంతు ప్రయత్నం కూడా ఉండాలి అని అంటుంది. ఆ మాటలు విన్న సత్య దేవుడమ్మ దగ్గరికి వెళ్లి అక్క కోసం అటువంటి నిర్ణయం తీసుకోకండి అని.. ఆరోగ్యం పాడవుతుందని అంటుంది. కానీ దేవుడమ్మ ఆ మాటలు వినకుండా.. రుక్మిణి దొరికే వరకు కనీసం నిద్రపోను అని అంటుంది.
సీన్ కట్ చేస్తే..
మరోవైపు రాధ తాను ఇంట్లో ఉంటున్నాను అని.. అసలు ఎందుకు ఉంటున్నావు అని ఆదిత్య తనను ఒక్క మాట కూడా అనలేదు అని అనుకుంటుంది. ఇక తాను త్వరలో ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తాను అని.. ఆదిత్యకు దేవిని అప్పజెప్పి వెళ్తాను అని అనుకుంటుంది. అప్పుడే చిన్నయి రావడంతో చిన్మయి రాధను చూసి నీ చీర బాగుంది అమ్మ అంటూ ముద్దు పెడుతుంది.
పెద్దయ్యాక మాకు కూడా ఇలాంటి చీరలు కొని పెట్టు అని నువ్వే కట్టాలి అంటుంది. ఇక దేవి పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాధ మాత్రం చిన్మయి గురించి బాధపడుతుంది. ఓ వైపు దేవుడమ్మ ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆదిత్య సత్యను ఎందుకు ఆపలేదు అని అంటాడు. అక్కడ రుక్మిణి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసావు కదా అని చెబుతూ బాధపడుతుంటాడు.
చిన్మయి కోసం బాధ పడుతున్న రాధ..
ఇక దేవి చిన్మయి కాలు నొక్కుతూ ఉంటుంది. రాధ వచ్చి అడగటంతో కాలు నొప్పి అనడంతో వెంటనే వెళ్లి వేడి నీళ్లు పెడుతుంది. రాధ దగ్గరికి దేవి కూడా వెళ్లి అక్కకు అమ్మ లేదు కదా అంటూ.. పాపం కదా అంటూ బాధ పడుతుంది. ఇక రాధ అలా ఏమీ కాదు అమ్మ నేను అమ్మ ని ఉన్నాను కదా అని అంటుంది. ఒక పిల్లలిద్దరికీ కాపురం పెడుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే చిన్మయి అడ్డుగా ఉంది అని బాధ పడుతుంది.

Devatha June 15 Episode: మెట్ల మీద నుంచి కింద పడ్డ మాధవ..
ఇక మరుసటి రోజు మాధవ దేవితో మీ అమ్మ కోపంగా ఉంది అని అంటాడు. అంతేకాకుండా తల్లి కూతుర్ల మధ్య చిచ్చు పెట్టడానికి తాను కావాలని కింద పడతాడు. దాంతో రాధ అక్కడికి రాకపోగా దేవి దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది. ఓవైపు భాష, ఆదిత్య బయటికి వెళ్లడానికి సిద్ధమవుతారు.