Devatha June 16 Episode: ఈరోజు ఎపిసోడ్ లో బాష ఆదిత్యను పొగుడుతూ మీ మేనత్తని ఇంట్లో నుంచి గెంటేసి చాలా మంచి పని చేసావు అని అనగా అప్పుడు ఆదిత్య పెద్దవాళ్ళ మంచి మాటలు చెప్పాలి కానీ ఇలా చెప్పకూడదు అందుకే అలా చేశాను అని అనడంతో వెంటనే కమల రుక్మిణి ఉంటే బాగుండేది అనగా అప్పుడు ఆదిత్య తన మనసులో నా భార్య రుక్మిణి చనిపోలేదు అని అనుకుంటాడు. ఆ తర్వాత ఆదిత్య కోపంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి పోతాడు.
రాధను కలిసిన ఆదిత్య..
ఆ తర్వాత రాధ దగ్గరికి వెళ్లగా అప్పుడు రాధ నా మనసు విప్పి మాట్లాడుతున్న పెనిమిటి నువ్వు పరేశాన్ కాకు అని చెప్పి నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు మన బిడ్డ ఆ మాధవ్ సార్ ని నాయనా అని అంటోంది. చిన్నప్పటి నుంచి కూడా అలాగే పిలుస్తోంది. కానీ నువ్వు కనిపించిన తరువాత కూడా దేవి అలానే పిలుస్తూ ఉంటే నా మనసుకు చాలా కష్టంగా ఉంది అని అంటుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు అని తెలిసిన తర్వాత నీకు కనిపించకుండా తిరిగాను. ఎన్నో నిద్రలేని రాత్రులు, బాధలు భరించాను అని అంటుంది రుక్మిణి. అప్పుడు ఆదిత్యునికి ధైర్యం చెబుతాడు.
సీన్ కట్ చేస్తే..
ఆదిత్య రాధకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతాడు. అంతలోనే అక్కడికి మాధవ వస్తాడు. అప్పుడు మాధవ మాట్లాడుతూ ఇలా పబ్లిక్ గా ఆదిత్యను కలవద్దు అంటే నా మాట వినవు అందరూ నిన్ను తప్పుగా అనుకుంటారు నిన్ను అలా అందరూ తప్పుగా అనుకుంటే నాకు నచ్చదు. సరే పద వెళ్దాం పదా కారు ఎక్కు అని అంటాడు. అప్పుడు రాధ కోపంతో రగిలిపోతూ ఉండగా ఇంతలో అక్కడికి ఊరి పెద్ద మనుషులు వస్తారు. అప్పుడు ఊరి పెద్దలు వారిద్దరికీ కలిపి మాట్లాడగా మాధవా మరింత రెచ్చి పోయి మాట్లాడతాడు.
అప్పుడు రాధ కోపంతో రగిలి పోతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ, రుక్మిణి కోసం ఉపవాస దీక్షను మొదలుపెడుతుంది. నా కోడలు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా దగ్గరికి రప్పించు తల్లి అనే దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంతలోనే దేవుడమ్మ మరిది వచ్చి వెళ్దామా వదినమ్మ అని అడగగా ఇద్దరు వెళ్తూ ఉండగా కమల ఎదురు పడటంతో దేవుడమ్మ సంతోషపడుతుంది. రుక్మిణి బతికే ఉంది అందుకే నేను వెతకడానికి వెళ్తున్నాను అనడంతో సత్య కమల భాష ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు.

Devatha June 16 Episode: రుక్మిణి వెతకడం కోసం బయలుదేరిన దేవుడమ్మ..
దేవుడమ్మ ఎంత చెప్పినా కూడా వినకుండా రుక్మిణి ని వెతకడం కోసం బయలుదేరుతుంది. సత్య, భాష, కమల ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉంటారు. భాష ఒకవేళ ఉంటే ఇన్నాళ్లు మన ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటుంది అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. మరొకవైపు భాగ్యమ్మ కాయలు అమ్ముకుంటూ దేవి వాళ్ళ స్కూల్ ముందు కూర్చుంటుంది. ఇంతలోనే దేవి,రాధ వాళ్ళు వస్తారు. వాళ్లను చూసి భాగ్యమ్మ ఆనంద పడుతూ ఉంటుంది. అది చూసి రాధ కూడా ఆనంద పడుతూ ఉంటుంది. తరువాయి భాగంలో దేవి ఆదిత్య తో కలసినవ్వుతూ మాట్లాడుతూ వుండగా మాధవ అది చూసి కోప్పడతాడు. అప్పుడు మాధవ దేవి అని పిలవడంతో వెంటనే దేవి మా నాయన వచ్చిండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.