Devatha June 2 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాధ చేసిన పనిని తలుచుకొని రాధ ఇలా ఎందుకు చేసింది అని ఆలోచిస్తాడు. ఎలాగైనా రాధకు నేను తప్ప మరో దారి ఉండకూడదు అని అనుకొని ఏం చేయాలి అని బాగా ఆలోచిస్తాడు. దాంతో అమ్మ సెంటిమెంట్ తో రాధను ఉక్కిరి బిక్కిరి చేస్తాను అని అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే..
రాధ, దేవి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ పొలం గురించి మాట్లాడుకుంటారు. ఇక దేవి నీకు పొలం పనులు వచ్చా ఎవరు నేర్పించారు అని అనటంతో.. గతంలో తన పొలంలో చేసిన పనులు గుర్తు చేసుకొని తను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను అని చెబుతుంది. అప్పుడే వారికి ఎదురుగా భాగ్యమ్మ ఎదురు పడటం తో దేవి వెంటనే వెళ్లి అమ్మమ్మ అని పిలుస్తూ ఉంటుంది.
సంతోషంలో భాగ్యమ్మ..
ఆ పిలుపుకి భాగ్యమ్మ సంతోషపడుతుంది. ఇప్పటినుంచి అలాగే పిలుస్తాను అని అంటుంది దేవి. ఇక భాగ్యమ్మ దేవిని పట్టుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. దేవి కి మామిడికాయ ఇవ్వటంతో ఓ చోట కూర్చొని తింటుంది. కాస్త ఆదిత్య మాటలకు దేవి మారినట్లు కనిపిస్తోంది. ఇక భాగ్యమ్మ తనకు చాలా సంతోషంగా ఉంది అని.. నీ బిడ్డే నన్ను అమ్మ అని పిలిచింది అని సంతోషపడుతుంది.
అక్కడ ఎలా ఉన్నావు అని భాగ్యమ్మ అడగటంతో అక్కడ జరిగిన విషయాలన్నీ చెబుతుంది. అంతేకాకుండా దేవి తన తల్లి కాదన్నమాట కూడా చెబుతోంది రాధ. మరోవైపు ఆదిత్య సత్యతో ఎక్కడికి వెళ్ళావు అని అడగటంతో.. రాధ అక్క దగ్గరికి వెళ్లాను అని అక్కడ తన బాధలు చెప్పుకున్నాను అని అంటుంది.
ఇక అక్క కూడా తనలో ఉన్న బాధను బయట పెట్టకుండా దాపెట్టింది అనటంతో అంటే పరాయి వాళ్ళము కదా అందుకే బాధలు చూపించలేదు అనటంతో.. వెంటనే ఆదిత్య రాధ పరాయిద అంటూ.. కమల కంటే ఎక్కువగా చూసుకుంటావు అని.. సంతోషాలను, కష్టాలను పంచుకుంటావు అని అంటాడు.
నిజం బయటపెట్టిన ఆదిత్య..
నిజం తెలిసి కూడా తెలియనట్టు ఉన్నావ్ కదా అని అనటంతో.. రాధే రుక్మిణి అని తెలిసి కూడా తెలియనట్టు ఉన్నావు అని అంటాడు. దాంతో సత్య కూడా నీకు తెలుసా అనడంతో తెలుసు అని అంటాడు. ఇక మన ప్రేమ కోసం అక్క ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని.. మళ్లీ తనే మా అక్క అని అంటే ఇంకెంత దూరం వెళ్ళిపోతుందన్న భయంతో ఇలా ఉన్నాను అంటుంది.
ఆదిత్య కూడా నేను కూడా అలాగే నటిస్తూ వస్తాను అని అంటాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అని అనుకుంటారు. ఓవైపు మాధవ ఎలాగైనా రాధను దూరం చేసుకోవద్దు అని అనుకుంటాడు. అప్పుడే దేవి, రాధ రావటంతో దేవి తను భాగ్యమని కలిసిన విషయాన్ని సంతోషంగా చెబుతుంది.

Devatha June 2 Episode: ఇంటి పనులు చేసుకుంటున్న జానకి..
మరోవైపు సత్య ఆదిత్యకు నిజం తెలిసిన కూడా ఇలా ఎందుకు ఉన్నాడు అని బాధ పడుతుంది. ఇక ఇంట్లో జానకి పనిచేస్తుండగా రాధ వచ్చి నేను చేస్తాను కదా అనటంతో ఈ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉంటుందో తెలియదుఅందుకే ఇప్పటి నుంచి పని చేయడం నేర్చుకుంటున్నాను అని అంటుంది.