Devatha June 20 Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవి ఇంట్లో కూర్చుని ఒక బొమ్మ గీస్తుండగా.. మాధవ దేవిని చూసి ఆలోచనలో పడతాడు. అంతేకాకుండా రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాధ ఈ ఇంటినుండి బయటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది అని.. దేవిని నాకు దూరం చేయాలని చూస్తుందని అనుకుంటాడు. ఎలాగైనా రాధను ఈ ఇంటి నుండి బయటకు పంపించకుండా చేయాలని.. ఒక రెండు రోజుల్లో తెలుస్తుందని అనుకుంటాడు.
సీన్ కట్ చేస్తే..
ఆదిత్య దేవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవి ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలి అని.. కానీ మాధవ అడ్డుగా ఉన్నాడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే సత్య వచ్చి ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అడగటంతో.. దేవి గురించి అని నోరుజారుతాడు. అప్పుడే సత్య ఆశ్చర్యంగా చూడటంతో.. వెంటనే ఆదిత్య దేవుడమ్మ అంటూ కవర్ చేస్తాడు.
అమ్మ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను అని మాట్లాడి పడుకుంటాడు. సత్య మాత్రం ఆదిత్య నాకు చెప్పకుండా ఏదో నిజం దాపెడుతున్నాడని అనుకుంటుంది. మరుసటి రోజు పిల్లలు స్కూల్ కి వెళ్లడానికి హడావుడి చేస్తారు. అంతేకాకుండా తన అవ్వ తాతతో సరదాగా కాసేపు ముచ్చట్లు పెడుతూ ఉంటారు.
షాక్ లో మాధవ..
అప్పుడే రాధ, మాధవ రావడంతో వారికి చెప్పి బయలుదేరుతూ ఉంటారు. దేవి మాత్రం మళ్లీ వెనక్కి వచ్చి మాధవ చేతికి పంచ్ ఇస్తుంది. ఇవాళ కొత్తగా ఏంటి అని మాధవ అడగటంతో.. ఆఫీసర్ సారు నేర్పించాడు అని అంటుంది. దాంతో ఆ మాటకు మాధవ షాక్ అవుతాడు.
పండ్లు అమ్ముకుంటున్న భాగ్యమ్మ..
ఆ తర్వాత రాధ దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టడంతో ఇది కూడా ఆఫీసర్ సారు చెప్పాడు అని అంటుంది. దాంతో రాధ తెగ సంతోషపడుతుంది. బిడ్డను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని అనుకుంటుంది. ఓవైపు ఆదిత్య స్కూల్ దగ్గర దేవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి భాగ్యమ్మ పండ్లు అమ్మడానికి బుట్ట పట్టుకొని వస్తుంది.
వెంటనే ఆదిత్యను చూసి భయపడి దాచుకుంటుంది. ఇక అప్పుడే పిల్లలు రావటంతో చిన్మయి పలకరించి లోపలికి వెళ్తుంది. ఇక దేవి మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. తండ్రి కూతుర్ల మధ్య మాటలు వింటూ భాగ్యమ్మ చాలా సంతోష పడుతుంది. అప్పుడే అక్కడ ఒక కారు వెనుకకి వస్తుండటంతో వెంటనే దేవిని కాపాడుతాడు.

Devatha June 20 Episode: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మాధవ..
దాంతో ఆదిత్య నా కూతురుకు ఏమైనా అయితే ఉండలేను అని అనటంతో ఆ తర్వాత ఆ విషయం గురించి అడుగుతుంది దేవి. ఆదిత్య వెంటనే గతంలో నిన్ను దత్తత తీసుకోవాలని అనుకున్నప్పుడు అలా నిర్ణయించుకున్నాను అని అంటాడు. తరువాయి భాగంలో మాధవ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. పైగా ఒక లెటర్ కూడా ఉంటుంది. అది చూసిన ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు.