Devatha June 21 Episode: ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ స్కూల్ దగ్గర పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి దేవి, చిన్మయి రావటంతో వాళ్లకు పండ్లు ఇస్తుంది. అప్పుడే అక్కడకు భాష భాగ్యమని చూసి వస్తాడు. ఈ వ్యాపారం చేసుకోవడం అవసరమా అంటూ కాసేపు వాధిస్తాడు. ఇక రుక్మిణి బతికే ఉంది అని నిజం చెప్పటం తో భాగ్యమ్మ షాక్ అవుతుంది.
తండ్రి కోసం టెన్షన్ పడిన దేవి..
దేవుడమ్మ కు ఎవరో తెలిసిన వ్యక్తి చెప్పారు అని కానీ ఎక్కడ ఉందో తెలీదు అనటంతో భాగ్యము ఊపిరి పీల్చుకుంటుంది. ఈ విషయం గురించి చెప్పడానికి వచ్చాను అని.. కమల కోసం ఇంటి దగ్గరికి రమ్మని అంటాడు. భాగ్యమ్మ మాత్రం తర్వాత కి వస్తా అని చెప్పి వెళ్లకుండా ఉంటుంది. ఆ తర్వాత దేవి ఇంట్లో మాధవ కోసం చూస్తూ వుంటుంది. కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడే మాధవ కనిపించడంతో చాలా టెన్షన్ పడ్డాను అని చెప్పి బాధపడుతుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఒక గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. మరోవైపు రాధ తన పెళ్లి ఫోటో చూసుకుంటూ బాగా కుమిలిపోతుంది. ఇదంతా తన వల్లే జరిగింది అని బాధపడుతుంది. ఎలాగైనా బిడ్డను నీకు ఇచ్చి నేను మరోచోటకు వెళ్తాను అని అంటుంది. ఇక ఉదయాన్నే దేవి మళ్లీ మాధవ కోసం ఇల్లంతా వెతుకుతుంది.
పిల్లలపై అరిచిన రాధ..
నాన్న కనిపించటం లేదు అని ఇంట్లో వాళ్లకు చెప్పటంతో అందరూ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడ చూసిన మాధవ కనిపించకపోయేసరికి పిల్లలిద్దరు టెన్షన్ పడతారు. ఇక రాధ మాత్రం పిల్లలు స్కూల్ కి రెడీ అవమని అనడంతో.. మేము వెళ్ళము అని మారం చేస్తుంటారు. నాన్న వచ్చాకే స్కూల్ కి వెళ్తాము అనడంతో వెంటనే రాధ పిల్లలపై అరుస్తుంది. దాంతో పిల్లలు స్కూల్ కి రెడీ అవుతారు.
షాక్ అయిన రాధ..
అప్పుడే జానకి పై నుండి ఏడ్చుకుంటూ వస్తుంది. అంతేకాకుండా మాధవ రాసిపెట్టిన లెటర్ చదువుతుంది. అది చూసి రాధ కూడా షాక్ అవుతుంది. ఇక ఎక్కడికి వెళ్ళాడు అని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనిని బట్టి చూస్తే రాధను దగ్గరికి చేసుకోవడానికి మాధవ ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు భాష కమలతో అత్తమ్మ కనిపించింది అని చెబుతాడు.

Devatha June 21 Episode: దేవి కి మాట ఇచ్చిన ఆదిత్య..
ఇక రోజులాగే ఆదిత్య స్కూల్ కి దేవి కోసం వస్తాడు. ఒక చోట దేవి కూర్చుని ఏడుస్తూ ఉండగా దేవి దగ్గరికి వెళ్తాడు. ఇక దేవి తన నాన్న కనిపించడం లేదు అని చెప్పటంతో ఆదిత్య షాక్ అవుతాడు. ఇక దేవి బాధను తట్టుకోలేక ఆదిత్య తాను మాధవ ని వెతికి ఇస్తాను అని దేవి కి మాట ఇస్తాడు. దాంతో దేవి ఎలాగైనా వెతికించమని బ్రతిమాలుతుంది.