Devatha June 23 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో దేవి మాధవకు గిఫ్ట్ ఇచ్చి ఇదే మా నాన్న మీద ఉన్న ప్రేమ అని అంటుంది. ఇక మాధవ కూడా తన చేతి మీద ఉన్న దేవి పచ్చబొట్టు చూపిస్తూ.. నువ్వంటే నాకు ఉన్న ప్రేమ ఇదే అని అంటాడు. దాంతో రాధ షాక్ అవుతుంది. ఇక ఆదిత్య తట్టుకోలేకపోతాడు.. అంతేకాకుండా ఈరోజు దేవి తనను అంత ఇష్టంగా చూడడానికి కారణం తన రాధ అని అంటాడు. ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తాన్ని స్టేజ్ మీద ఉండేలా చేస్తాడు. ఇదే నా కుటుంబం అంటూ.. పిల్లలే నా బలం అని అనడంతో ఆదిత్య షాక్ అవుతాడు.
సీన్ కట్ చేస్తే..
ఆదిత్య ఇంట్లోకి దిగులుగా రావడంతో సత్య వచ్చి.. ఆంటీ ఆరోగ్యం బాగాలేదు అని.. ఈ వయసులో ఉపవాసం చేయటం వల్ల నీరసంగా ఉంటుంది అని మేము చెప్పినా కూడా వినటం లేదు అని అనటంతో అప్పుడే దేవుడమ్మ వినను అంటూ.. నా కోడలు నా ఇంటికి రావాలి అని.. రుక్మిణి ముఖం చూడాలి అని అప్పటి వరకు తన నిర్ణయం మారదని గట్టిగా చెబుతుంది.
దేవిని దూరం చేయలేవంటున్న మాధవ..
మరోవైపు రాధ వేడుకలో జరిగిన విషయాన్ని తలచుకుంటూ ఉంటుంది. కోపంతో రగిలి పోతూ ఉంటుంది. అప్పుడే మాధవ అక్కడికి రావడంతో మరింత కోపంగా రగిలిపోతుంది. ఒక్క రోజు ఇంట్లో నుంచి దేవి వెళ్ళిపోతే దేవి ఎలా అల్లాడిపోయిందో చూశావా.. ఈ పచ్చబొట్టు తో దేవి మనసులో చెరగని మచ్చలా ప్రేమ పెంచుకున్నానని అంటాడు. దేవిని నానుండి దూరం చేయటం నీవల్ల.. ఆదిత్య వల్ల కాదు అని అంటాడు.
మాధవను చూసి వెటకారంగా నవ్విన రాధ..
ఇక మాధవ మాటలకు రాధ కోపంతో రగిలి పోకుండా వెటకారం గా నవ్వుతూ.. బాగా దిగజారిపోయావని.. మిమ్మల్ని చూస్తే కోపం కంటే బాధనే అనిపిస్తుందని అంటుంది. తనకు దేవి ని దూరం చేస్తే ఊరుకునేది లేదు అన్నట్లుగా మాట్లాడుతూ.. అంతేకాకుండా ఆదిత్య కూడా చూస్తూ ఊరుకోడు అని అంటుంది. చిన్మయి కోసం ఉన్నానని.. ఒకవేళ నిన్ను గట్టిగా నిలదీస్తే చిన్మయి బాధ పడుతుంది అని గట్టిగా క్లాస్ పీకి అక్కడి నుంచి వెళ్తుంది.
ఓ వైపు మాధవ కూడా వేడుకలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. మాధవ దేవిపై లేనిపోని ప్రేమను చూపిస్తూ దేవిని దగ్గరికి చేసుకున్నాడు అని అనుకుంటాడు. దేవి తనను కాదని మాధవపై ప్రేమ చూపిస్తే తట్టుకోలేకపోతున్నాను అని బాధ పడతాడు. అప్పుడే సత్య వచ్చి దేవుడమ్మ గురించి చెబుతూ బాధపడుతుంది. ఆదిత్య రాధను కలిసి దేవి విషయంలో బాగా బాధపడుతూ ఉంటాడు.

Devatha June 23 Episode: జానకి పై కోపంతో రియాక్ట్ అయినా రాధ..
ఇక ఇలా ఉండటం నావల్ల కాదు అంటూ.. మన ఇంటికి వెళ్దాం అని రాధతో అంటాడు. కానీ రాధ పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి అని బాధపడుతుంది. ఇక తనతో మాట్లాడటానికి రాధకు ఒక ఫోన్ ఇస్తాడు. దీంతో రాధ ఆదిత్య కు మరింత దగ్గర అవుతుంది. తరువాయి భాగంలో రాధ జానకి పై కోపం గా రియాక్ట్ అవుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతాను అని గట్టిగా చెప్పేస్తుంది.