Devatha June 24 Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి స్కూల్ కు వెళ్తుంటారు. ఇక దేవి తన ఫ్రెండ్ పుట్టినరోజు అని తన ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇవ్వాలి అని రూ.500 తెచ్చుకుంటుంది. అప్పుడే ఆ డబ్బులు గాలికి ఎగిరిపోయి ఒక తాగుబోతు చేతిలో పడగా అతడు ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరించడు. అది తన డబ్బు అని అంటాడు.
తన తండ్రి కలెక్టర్ అని చెప్పిన దేవి..
దాంతో దేవికి గతంలో ఆదిత్య మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు మా నాన్న కలెక్టర్ అని చెప్పు అని పోలీస్ స్టేషన్ లో వేస్తారు అని చెప్పమంటాడు. ఇక ఆ మాటలే ఆ తాగుబోతు కి చెప్పటంతో అతడు భయపడి డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తాడు.
సీన్ కట్ చేస్తే..
స్కూల్ లో పండ్లు అమ్ముకుంటున్న భాగ్యమ్మ దగ్గరకు భాష, కమల వస్తారు. ఇక కమల తన తల్లి పై బాగా కోపంతో రగిలిపోతుంది. ఇక్కడ పండ్లు ఎందుకు అమ్ముతున్నావని.. ఇంటికి రమ్మంటే ఎందుకు రావడం లేదని గట్టిగా అడుగుతుంది. అంతేకాకుండా కళ్ళు తాగడం కూడా మానేసావ్ అంట కదా అని అనడంతో.. చిన్న బిడ్డ కోసం మానేశాను అని నోరు జారడం తో.. మళ్ళీ ఇక్కడున్న పిల్లల కోసం తాగడం మానేశానని అంటుంది.
అప్పుడే అక్కడికి దేవి.. అమ్మమ్మ అనుకుంటూ వచ్చి అందరికీ పండ్లు తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత వాళ్లు కాసేపు మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు జానకి రాధ దగ్గరికి వచ్చి కొన్ని బాధ్యతలు అప్పజెప్పుతుండగా రాధ అవన్నీ తనకు చెప్పొద్దని తను ఇంట్లో నుంచి తన బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళి పోతానని గట్టిగా చెబుతోంది.
జానకితో ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పేసిన రాధ..
అంతేకాకుండా ఊర్లో ఉన్న వారందరికీ మీరే కోడలు అని చెప్పి తిరిగారు అంటూ.. నేను ఇంటికి వచ్చిన మొదట్లోనే ఎప్పుడు వెళ్తానో అని అన్నాను అని అనడంతో జానకి బాధపడుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని తన గదిలోకి వెళ్తుంది. ఆ తర్వాత సత్య ఆదిత్య గదిలో చిన్న ఫోన్ బాక్స్ చూసి ఆశ్చర్యపోతుంది.
ఆదిత్యను అడగటంతో ఆదిత్య వెంటనే వాచ్మెన్ కు అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత సత్య తన అత్తయ్య చేస్తున్న ఉపవాసం మానేసేలా చేస్తానని అంటుంది. ఇక ఓవైపు జానకి మాధవ తో మాట్లాడుతుంది. రాధతో నీ ప్రవర్తనలో మార్పు రావటం వల్లే తాను ఈ ఇంట్లో నుంచి వెళ్లి పోతాను అంటుంది అని.. తనతో మంచిగా మాట్లాడి సొంతం చేసుకోవాలి అన్నట్లుగా చెబుతుంది.

Devatha June 24 Episode: గుడిలో ఒకే చోట ఉన్న అత్తా కోడలు..
తరువాయి భాగంలో దేవుడమ్మతో పాటు తన కుటుంబం మొత్తం గుడిలో ఉంటుంది. దేవుడమ్మ అందరికీ వాయనం ఇస్తూ ఉంటుంది. ఇక దేవుడమ్మ ని చూసిన రుక్మిణి భయపడి దాచుకుంటుంది. ఆ తర్వాత దేవుడమ్మ తన దగ్గర ఉన్న వాయనం ఇవ్వడానికి రుక్మిణి దగ్గరికి వెళుతుంది. తరువాయి భాగంలో దేవుడమ్మ తన కోడల్ని చూస్తుందో లేదో చూడాలి.