Devatha June 3 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో జానకి రాధతో ఇంట్లో పని చేస్తూ ఇప్పటి నుంచే పని చేయటం మంచిది అని.. ఎందుకంటే రేపు వచ్చే కోడలు పని చేపిస్తుందో చేస్తుందో తెలియదు కదా అని అంటుంది. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాకు పట్టింపు ఉండదు అంటూ కానీ ఊరి ప్రజలు మాత్రం నిన్ను మా ఇంటి కోడలిగా అనుకుంటున్నారు అని నీ గురించి మేమే కాకుండా మాధవ కూడా ఆలోచిస్తున్నాడు అని అంటుంది
సీన్ కట్ చేస్తే..
మాధవ ఒక గదిలో ఒంటరిగా నించొని తన ఫోన్లో రాధ ఫోటోలు చూస్తూ ఉంటాడు. అప్పుడే రాధ కోపంతో మాధవ దగ్గరికి వచ్చి ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది. ఇన్ని రోజులు మీరే అనుకున్న ఇప్పుడు మీ అమ్మ నాన్నలు కూడా వేధిస్తున్నారు అనటంతో మాధవ మాత్రం వాళ్లది తప్పు లేదు అంటూ ఊరి జనాల దృష్టిలో నువ్వు ఈ ఇంటి కోడలివి అని అంటాడు.
అంతేకాకుండా నిన్ను వదులుకోనేది లేదు అని.. పిల్లల కోసం నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనటంతో రాధ షాక్ అవుతుంది. పైగా నీకు మరో దారి లేదు అంటూ.. ఈ ఇంట్లో నీ ప్రయాణం చాలా సాగింది అంటూ.. కనీసం ఆదిత్య తో కూడా మనకు పెళ్లి కాలేదు అని చెప్పలేక పోతున్నావు అని అంటే కారణం నువ్వు ఈ ఇంటికి బందీవీ అయ్యావు అని అంటాడు.
ఇక అప్పుడే బయట నుంచి దేవి ఇంట్లోకి వస్తుంది. మాధవ, రాధ మాట్లాడుతున్న మాటలు చాటుగా వింటుంది. రాధ చిన్మయి కోసం మీ ఇంటికి వచ్చాను అని.. నా బిడ్డ తో పాటు చిన్మయి కి పాలు ఇచ్చాను అని.. తనని కూడా బిడ్డ లాగే చూసుకుంటున్నాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న దేవి ఆలోచనలో పడుతుంది.
మరోవైపు ఆదిత్య వాళ్ళ మేనత్త ఇంట్లోకి రావటం రావటం తోనే పనిమనుషుల తో గొడవ పెట్టుకుంటుంది. ఆమె గొంతు విన్న ఆదిత్య వాళ్ళ తండ్రి అక్క వచ్చింది అని వణికిపోతూ వెంటనే బయటకు వెళ్లి పలకరిస్తాడు. ఇక ఆవిడ మాత్రం ఇంత అరిచిన కూడా ఇంట్లో వాళ్ళు బయటికి రావటం లేదు అని గట్టిగా అంటుంది. ఇంట్లోకి వెళ్ళగానే దేవుడమ్మ ను, ఆదిత్య వాళ్ళని పిలుస్తుంది.
కమలకు అవమానం.. సత్యకు దుఃఖం
ఇక దేవుడమ్మ ఆమెను పలకరించగా.. అప్పుడే అక్కడికి కమల వాళ్లు కూడా వస్తారు. వారిని చూసి వీళ్లు ఎవరు అని అడగటంతో.. సత్య వాళ్ళ అక్క అని అంటారు. చెల్లి తో పాటు ఇక్కడే ఉందాము అని అనుకుంటున్నారా అని అవమానిస్తుంది. సత్య చూసి పలకరించి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు అని వాళ్ళు ఎక్కడ అని అడుగుతుంది. ఆ మాట విని సత్య తో పాటు అందరూ చాలా బాధ పడతారు.

Devatha June 3 Episode: సంతోషంలో రాధ..
రాధ ఒంటరిగా పనిచేస్తూ మాధవ మాట్లాడిన మాటలు తలుచుకొని కోపంతో రగిలి పోతుంది. అప్పుడే తన తల్లితో ఇంటికి వెళ్ళేదని ఇలా జరగకుండా ఉండేది అని బాధపడుతుంది. ఇక దేవి వచ్చి జరిగిన విషయాన్ని చెబుతూ నిన్ను బాధపెట్టాను అమ్మ అని సారీ చెబుతుంది. మొత్తానికి దేవి రాధనే తన తల్లి అని నిజం తెలియటంతో రాధ సంతోషంగా ఫీల్ అవుతుంది.