Devatha June 9 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య ఒక చోట నిలబడి రాధ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. మాధవ ని పెళ్లి చేసుకుందనుకొని ఏమీ లాభం లేదు అన్నట్లుగా తన ఫోటో వైపు చూసి మాట్లాడుతాడు. అంతలోనే అందులో రాధ మెడలో తాళిబొట్టు చూసి షాక్ అవుతాడు.
తాళిబొట్టు తో బయటపడ్డ నిజం..
గతంలో ఆ తాళిబొట్టు తన తల్లి దేవుడమ్మ కాబోయే కోడలు కోసం చేశాను అని ఆదిత్యకు చూపించటంతో ఆ తాళి బొట్టే రుక్మిణి మెడలో కట్టాను అనుకొని ఆ తాళి బొట్టే ఇదే అని అనుకుంటాడు. ఒకవేళ రుక్మిణి మాధవను పెళ్లి చేసుకుంటే మరో తాళిబొట్టు ఉండాలి. కానీ ఈ తాళిబొట్టు ఉంది అంటే రుక్మిణి మాధవను పెళ్లి చేసుకోలేదేమో అని అనుకుంటాడు.
అంటే నేనే పొరపాటు పడ్డాను అనుకుంటూ.. ఖచ్చితంగా రుక్మిణి మాధవను పెళ్లి చేసుకోలేదు అని నమ్మకం రావటంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. పైగా గతంలో రాధ ఏ రోజు కూడా మాధవను పెనిమిటి అనలేదు అని.. ఒకవేళ మాధవని పెళ్లి చేసుకుంటే నన్ను పెనిమిటి ఎందుకు అంటుంది అని రుక్మిణి మాధవను పెళ్లి చేసుకోలేదు అని అక్కడి నుండి సంతోషంగా కార్లో బయలుదేరుతాడు.
సీన్ కట్ చేస్తే..
స్కూల్లో చిన్మయిని మరో అమ్మాయి నెట్టడం తో వెంటనే దేవి వెళ్లి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక రాధ ఒంటరిగా నడుచుకుంటూ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది. అప్పుడే మాధవ ఎదురుపడి అలా ఎందుకు చేస్తున్నావు.. నువ్వు ఆదిత్య భార్యవి అని అందరికీ ఎందుకు చెబుతున్నావు అని.. ఎవరైనా వింటే నా పరువు పోతుంది అని అంటాడు.
ఇంతకాలం మౌనంగా ఉన్న రాధ ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పేసింది. ఆదిత్య సంతోషంగా కారులో వస్తూ గతంలో రాధ తో గడిపిన క్షణాలను తలచుకుంటాడు. ఓ వైపు మాధవ రాధతో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు ఆదిత్యను పెనిమిటి అనడం కరెక్ట్ కాదు అని అంటాడు. ఆ మాటతో రాధ కోపంతో రగిలిపోతూ అటువంటి ఆలోచనలు నాకు లేవని అంటుంది.
షాక్ అయిన మాధవ..
కేవలం మీ అమ్మ నాన్న కోసం, బిడ్డ కోసం వచ్చాను అని అప్పటినుంచి నేను ఇదే మాట చెబుతున్నాను అని గట్టిగా మాట్లాడుతుంది. మాధవ మాత్రం ఊరి జనాలు నిన్ను మా ఇంటి కోడలిగా అనుకుంటున్నారు అని.. ఇప్పుడు ఇలా చేస్తే బాగుండదు అని.. ఊరి జనాల మధ్య పంచాయతీ పెట్టిస్తాను అని అంటాడు. దాంతో రాధ కూడా పంచాయితీ పెట్టించడని అనడంతో మాధవ షాక్ అవుతాడు.

Devatha June 9 Episode: రాధ మాటలతో ఆదిత్య క్లారిటీ..
ఎప్పటికైనా నా పెనిమిటి ఆదిత్య అంటూ నువ్వు రావాలి అని చూస్తే ఊరుకోను అని అంటుంది. ఇక మాధవ వస్తూ వస్తూ రాధని చూసి కారు ఆపి వారి దగ్గరికి వెళ్తాడు. తరువాయి భాగంలో రాధ ఆదిత్య నా పెనిమిటి అని.. నీకు నాకు సంబంధం ఏమిటి అని గట్టిగా అడగటంతో మాధవ కు మొత్తం మీద నిజం తెలిసిపోతుంది.