Devatha May 10 Episode: రాధకు పరీక్ష పెట్టిన మాధవ.. ఫోటోను చూసి షాక్ లో ఉన్న రాధ!

Akashavani

Devatha May 10 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాధ, మాధవ దగ్గరకు వచ్చిన రామమూర్తి ఇవాళ గుడిలో పెళ్లిళ్లు జరిపించాలని.. కాబట్టి ఇద్దరూ వెళ్ళిరండి అని అంటాడు. దాంతో రాధ బాగా కోపంగా రియాక్ట్ అవుతుంది. నేను గుడికి వెళ్ళను.. అసలు నన్ను ఎలా వెళ్ళమంటున్నారు అంటూ గట్టిగా నిలదీస్తుంది రాధ. కానీ రామమూర్తి నువ్వు వెళ్ళకపోతే నా పరువు పోతుంది అని అంటాడు. అయినా కూడా రాధ వెళ్ళనని అంటుంది.

సీన్ కట్ చేస్తే..

రాధ ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంది. మాధవ మాట్లాడిన మాటలు, గతంలో ఆదిత్య మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఆలోచనలో పడుతుంది. మాధవ సారు తీరు మారిందని, ఆదిత్య సారు పిల్లల కోసం బాధ పడుతున్నాడు అని ఆలోచిస్తుంది. అంతే కాకుండా తన చెల్లెలు సత్య కూడా పిల్లలు లేక పోవడంతో బాధపడుతుందని అనుకుంటుంది.

మారం చేసిన పిల్లలు..

మరోవైపు ఇంట్లో ఎవరి పని వాళ్లు చేస్తూ ఉండగా జానకి పిల్లలకు స్కూల్ బాక్స్ లు పెడుతుంది. పిల్లలు వచ్చి ఏమి కూర అని అనడంతో అది తమకు ఇష్టమైన కూర కాదని కాసేపు మారం చేస్తారు. ఇష్టం లేని కూర పెడితే ఎలా తింటాము అని గట్టిగా అడుగుతారు. ఇక రామమూర్తి వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో అయినా కూడా వినరు.

ఆ తర్వాత రాధ దగ్గరికి మాధవ వచ్చి గుడికి వెళ్లే విషయం గురించి చెబుతాడు. దాంతో రాధ మళ్లీ కోపంతో రగిలిపోతుంది. అయినా కూడా మాధవ ఎలాగైనా రాధను గుడికి తీసుకువెళ్లాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఇక గుడి కి వెళ్లకపోతే అక్కడ పెళ్లిళ్లు ఆగిపోతాయని, నాన్న పరువు పోతుంది అని తన మాటలతో కొంత ఒప్పించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్లి కారులో కూర్చుంటాడు.

గుడికి వెళ్లిన రాధ, మాధవ..

దాంతో రాధ మళ్లీ ఆలోచనలో పడుతుంది. వెళ్లకపోతే రామమూర్తి పరువు పోతుంది అని అనుకొని తప్పక వెళుతుంది. ఇక గుడి దగ్గరికి వెళ్లగా అక్కడ మాధవ తన పై రాధ కు ఉన్న అభిప్రాయం ఏంటో అని ఒక పరీక్ష పెడతాడు. దీంతో తాను కళ్ళు తిరిగి కింద పడి పోయినట్లుగా చేయడంతో వెంటనే పక్కనే ఉన్న రాళ్ల మీద పడకుండా రాధ కాపాడుతుంది.

Devatha May 10 Episode: రాధకు పరీక్ష పెట్టిన మాధవ.. ఫోటోను చూసి షాక్ లో ఉన్న రాధ!
Devatha May 10 Episode: రాధకు పరీక్ష పెట్టిన మాధవ.. ఫోటోను చూసి షాక్ లో ఉన్న రాధ!

Devatha May 10 Episode:  షాక్ లో రాధ..

వెంటనే అక్కడున్న కొందరు వచ్చి భార్యగా మీలో బాధ్యతలు చాలా ఉన్నాయి అని తెగ పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్లి కూర్చుంటారు. ఆ సమయంలో రాధ అక్కడ ఉన్న తమ ఫోటో బ్యానర్ చూసి ఓకే సారి షాక్ అవుతుంది. మరోవైపు కారులో ఆదిత్య పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తరువాయి భాగం లో రాధ దగ్గరికి ఆదిత్య వచ్చి నిజం చెప్పమని అడగటంతో అప్పుడే మాధవ వచ్చి షాక్ ఇస్తాడు.

- Advertisement -