Devatha May 11 Episode: బయటపడ్డ మాధవ కుట్ర.. ఇంటికి దూరంగా వెళుతున్న రాధ!

Akashavani

Devatha May 11 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రాధ గుడి లోపలికి రాగానే అక్కడ మాధవ తో ఉన్న తన ఫోటోను చూసి షాక్ అవుతుంది. ఇక పక్కనే ఉన్న మాధవ దగ్గరికి ఓ వ్యక్తి వచ్చి కర్ర సహాయం లేకుండా ఎలా ఉంటారు అని అడగటంతో మాధవ కారు లో ఇంకొక కర్ర ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న రాధ అంటే మాధవ సార్ కి ఇదంతా ముందే జరుగుతుందని తెలిసి ఇదివరకు ఎన్నడూ లేనిది కర్ర ఇప్పుడు కారులో ఉండటం ఏంటి ఆలోచిస్తుంది.

అమ్మవారి ముందు తన బాధలు చెప్పుకున్న రాధ..

దాంతో మాధవ కు జరిగిన ప్రమాదం గురించి కూడా ఆలోచిస్తూ ఉండగా ఇదంతా మాధవ కుట్ర అని అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ పూజ కార్యక్రమం లో పాల్గొనగా రాధ ఉండదు. దీంతో రాధ అమ్మవారి ముందు తన చేతిలో హారతి పెట్టుకొని దేవుడిని వేడుకుంటుంది. దేవుడికి తన బాధలు చెప్పుకుంటుంది. ప్రేమగా చూసుకునే భర్త ను, అమ్మలాంటి అత్తమ్మ ను, ఆ ఇంటిని వదులుకున్నందుకు బాధపడుతూ ఉంటుంది. ఇక తన కోసం, తన బిడ్డకోసం ఆఫీసరు సారు ఇక్కడికి వచ్చాడు అని అమ్మవారికి చెప్పుకుంటుంది.

ఇక మాధవ గురించి, మాధవ కుట్ర గురించి కూడా చెప్పుకుంటూ బాధపడుతుంది. మాధవ సారును పట్టుకున్నందుకు ఇలా చేయి కాల్చుకుంటున్నానని అనుకుంటుంది. ఇక అప్పుడే అక్కడికి రామమూర్తి వాళ్ళు వచ్చి రాధను అలా చూసి బాధ పడతారు. అక్కడ పక్కన ఉన్నవాళ్లు భర్త ప్రమాదం నుంచి బయట పడ్డాడు అని అందుకే అలా చేస్తుంది అని అంటారు. దాంతో ఆ విషయాన్ని రాధ కూడా కాస్త కోపంగా చెబుతుంది.

పూజలో కూర్చోకుండా ప్లాన్ చేసిన రాధ..

మాధవ తన తల్లిదండ్రులతో ఇదంతా చేసింది నా మీద ప్రేమతో కాదు అని పూజ లో నా పక్కన కూర్చోకుండా ఇలా చేసింది అని అంటాడు. మొత్తానికి పూజలో రామమూర్తి దంపతులు కూర్చోవడంతో మాధవ మాత్రం కాస్త ఫీల్ అయినట్లు కనిపిస్తాడు. ఇక ఆదిత్య గుడి కి వచ్చి రాధను కలుస్తాడు. వెంటనే రాధ మాట్లాడుతుండగా.. తనలో ఉన్న అనుమానాన్ని బయటపెడతాడు ఆదిత్య. చిన్నయినే మన బిడ్డ అని అడగటంతో రాధ ఏదో నిజం చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే.. మాధవ వచ్చి ఆపుతాడు.

Devatha May 11 Episode: ఇంట్లో నుంచి బయటికి వెళ్లి పోతున్న రాధ..

అంతేకాకుండా తన కోసం చెయ్యి కాల్చుకుంది అని కూడా చెప్పి ఇలా పరాయి వారితో మాట్లాడటం కరెక్ట్ కాదు అని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. ఇక తరువాయి భాగంలో రాధ బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా తను ఈ ఇంటి నుండి వదిలి వెళ్తున్నాను అని అంటుంది. ఆ మాటకు మాధవ షాక్ అవ్వగా.. ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది. అప్పుడే రాధకు ఒకావిడ ఎదురవుతుంది.

- Advertisement -