Devatha May 14 Episode: నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అంటూ ఆదిత్యను వేడుకున్న రాధ.. కోపంతో ఊగిపోతున్న మాధవ..

Akashavani

Devatha May 14 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రామమూర్తి కుటుంబం అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో జానకి రేపు మామిడి తోట కి వెళ్ళాలి అని మాట్లాడటం తో పిల్లలు కూడా మేము వస్తాం అని మారం చేస్తారు. దాంతో దేవి తన తల్లితో వెళ్దాం అమ్మ అని అనడంతో వద్దు అని గట్టిగా కోప్పడుతుంది. చిన్మయి అడగటంతో సరే అంటుంది. జానకి మాత్రం ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి అని అనటంతో మాధవ తన మనసులో రాధ ఇక్కడ ఉండకూడదని ప్లాన్ చేసింది అని అనుకుంటాడు.

సీన్ కట్ చేస్తే..

అందరూ నిద్ర పోయాక దేవి ఒంటరిగా గతంలో లక్ష్మి తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు తలుచుకుంటుంది. అంతేకాకుండా రాధ మాట్లాడిన మాటలు కూడా తలుచుకుంటూ ఆలోచనలో పడుతుంది. తోట కి వెళ్దాము అని నేను అడిగితే వద్దు అన్నదని అదే అక్క అడగటంతో వెళ్దాం అన్నదని ఆలోచనలో పడుతుంది. దీంతో రాధ మాధవ ని ఉద్దేశించి చేసే పనులు దేవికి మరోలా అర్థం అవుతున్నాయి.

ఇక సత్య ఊరికి వెళ్లిన దేవుడమ్మ కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక దేవుడమ్మ ఆదిత్య గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య రావటంతో కాస్త తడబడుతుంది. ఆదిత్య తో కూడా ఫోన్ మాట్లాడిస్తుంది. ఆ తర్వాత తమకు బట్టలు ఫోటోలలో పంపావు అని అది చూసి సెలెక్ట్ చేయమని అనడంతో సత్య, ఆదిత్య బట్టలు సెలెక్ట్ చేసుకుంటారు.

మాధవ ఇంటికి బయలు దేరిన ఆదిత్య..

ఆ తర్వాత కారులో ప్రయాణిస్తూ ఓ చోట తల్లి కూతుర్ని చూసి రాధ, దేవిలను ఊహించుకుంటాడు. మళ్ళీ పిల్లల విషయంలో ఆలోచనలో పడతాడు. ఎలాగైనా పిల్లల విషయంలో ఓ క్లారిటీ తెచ్చుకోవాలని మాధవ ఇంటికి బయలు దేరుతాడు. సత్య పనిచేస్తూ ఉండగా అక్కడికి భాష వచ్చి కమల హాస్పిటల్ గురించి మాట్లాడుతాడు. ఈరోజు హాస్పిటల్ కి మాతో పాటు మీరు కూడా రావాలి అనడంతో సత్య సరే అంటుంది.

రాధ మీద ఉన్న ఇష్టాన్ని బయటపెడుతున్న మాధవ..

మరోవైపు రాధ వంట చేయడానికి వంట గదిలోకి వెళ్ళేసరికి అక్కడ మాధవ కూరగాయలు కట్ చేసి ఉంచుతాడు. అంతే కాకుండా కాస్త డబల్ మీనింగ్ గా మాట్లాడినట్టు కనిపిస్తాడు. దాంతో మాధవ మాటలు తనకు అసౌకర్యంగా ఉండటం తో అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక అక్కడ కూడా తనమీద ఉన్న ఇష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు.

Devatha May 14 Episode: నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అంటూ ఆదిత్యను వేడుకున్న రాధ.. కోపంతో ఊగిపోతున్న మాధవ..
Devatha May 14 Episode: నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అంటూ ఆదిత్యను వేడుకున్న రాధ.. కోపంతో ఊగిపోతున్న మాధవ..

Devatha May 14 Episode: ఆదిత్యను కౌగిలించుకున్న రాధ..

ఇక ఆదిత్యను చూసి ఎమోషనల్ అవుతూ.. పెనిమిటి అని ఏడుస్తూ ఇక్కడి నుంచి నన్ను ఎలాగైనా తీసుకెళ్ళండి అంటూ గట్టిగా కౌగిలించుకొని వేడుకుంటుంది. ఆ తర్వాత ఇది తను ఊహించుకున్నట్లు కనిపిస్తుంది. ఆదిత్య పిల్లల గురించి వచ్చాను అనటంతో మాధవ కాస్త వెటకారంగా మాట్లాడుతాడు. ఇక మాధవ వెళ్తుండగా రాధ కాఫీ తీసుకొస్తాను అని ఆపుతుంది. మరోవైపు మాధవ మాత్రం ఆదిత్య రాకను జీర్ణించుకోలేక మండి పడుతూ ఉంటాడు.

- Advertisement -