Devatha May 2 Episode: మాధవ చేతిలో మల్లెపూలు.. ఇక ఆ ఇంటికి వెళ్ళనంటున్న రాధ!

Akashavani

Devatha May 2 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రామమూర్తి, జానకి లు రాధ దగ్గరికి వెళ్లి దేవి దత్తత విషయంలో ఆదిత్య నుండి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అని అడుగుతారు. అంతే కాకుండా అతడు దేవిని దత్తత ఇవ్వడానికి ఏమైనా బలవంతం చేస్తున్నాడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటం తో.. రాధ ఎక్కడ నిజం చెబుతుందో అన్న భయంతో మాధవ వచ్చి.. ఈ ఇంటికి వచ్చి మనల్ని కాదని తీసుకెళ్లే ధైర్యం ఎవరికీ లేదు అన్నట్లుగా చెబుతాడు.

రాధకు థాంక్స్ చెప్పిన మాధవ..

అంతేకాకుండా ఆదిత్య కు సహాయం చేయడం కోసమే ఇలా చేసింది అని సర్ది చెబుతాడు. ఆ తర్వాత రాధ మాధవను పిలిచి రామ మూర్తి వాళ్ళ ముందు తనను కాపాడినందుకు థాంక్స్ చెబుతోంది. కానీ మాధవనే తన మనసులో ఆదిత్య గురించి నిజం చెప్పలేదు అని తనకు థాంక్స్ చెప్పుకుంటాడు. ఇక రాధను భర్త, బిడ్డకు మధ్య ఉన్న ప్రేమను అడగటంతో రాధ ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి వివరిస్తుంది.

ఆ ఇంటికి వెళ్ళనంటున్న రాధ..

దాంతో మాధవ ఆదిత్య మీద ఉన్న ప్రేమతో బిడ్డని ఇవ్వాలి అనుకుంటున్నావా అని అడుగుతాడు. వెంటనే రాధ గతంలో ఒక చిన్న పొరపాటు చేశాను అని అది సరిదిద్దుకోవడానికి బిడ్డను ఆ ఇంటికి పంపివ్వాలి అని అంటుంది. ఇక మాధవ నువ్వు కూడా ఆదిత్య పిలిస్తే వెళ్ళిపోతావా అనడంతో.. ఆ ఇంటికి అస్సలు వెళ్ళను అని తన మనసులో ఉన్న నిజాన్ని చెబుతుంది. దాంతో మాధవ సంతోష పడినట్లు కనిపిస్తాడు. పైగా తనకు థాంక్స్ కూడా చెబుతాడు.

సీన్ కట్ చేస్తే..

దేవి, చిన్మయి లకు రాధ, జానకిలు గోరింటాకు పెడుతూ ఉంటారు. అక్కడే ఉన్న రామమూర్తితో సరదాగా మాట్లాడుకుంటారు. కాసేపు రామమూర్తి దంపతులకు మధ్య సరదా సన్నివేశం జరుగుతూ ఉంటుంది. ఇక జానకి, రాధలు కూడా గోరింటాకు పెట్టుకుంటారు. అప్పుడే అక్కడకు మాధవ మల్లెపూలు తీసుకొని రావటంతో.. జానకి తనకు పెట్టుకోవడానికి గోరింటాకు ఉండటంవల్ల రామమూర్తి తో పెట్టించుకుంటుంది. ఇక పిల్లలు కూడా అమ్మకు నాన్న పెట్టాలి అనడంతో అందరూ షాక్ అవుతారు.

Devatha May 2 Episode: దేవికి అన్నం తినిపించిన చిన్మయి..

Devatha May 2 Episode: మాధవ చేతిలో మల్లెపూలు.. ఇక ఆ ఇంటికి వెళ్ళనంటున్న రాధ!
Devatha May 2 Episode: మాధవ చేతిలో మల్లెపూలు.. ఇక ఆ ఇంటికి వెళ్ళనంటున్న రాధ!

ఇక పిల్లలు అడగటంతో మాధవ పువ్వులు పట్టుకోగా రాధ షాక్ అవుతుంది. ఆ తర్వాత మాధవ రాధ దగ్గరికి రాగా.. రాధ వెంటనే పిల్లలకు పెట్టమని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఓవైపు చిన్మయి దేవి కనపడకపోయేసరికి బాధ పడిన విషయం గురించి దేవికి చెబుతుంది. అప్పుడే రాధ భోజనం సిద్ధం చేయగా.. దేవికి అన్నం తినిపిస్తుంది చిన్మయి. అది చూసిన ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఫీల్ అవుతారు.

పిల్లలు దూరమై దగ్గరయ్యే సరికి ఎలా ఉన్నారో చూడండి అంటూ సంతోషంగా కనిపిస్తారు. ఇక మాధవ మనమంతా సంతోషంగా ఉన్నా కూడా రాధ మాత్రం దేవిని ఆదిత్యను ఇవ్వనందుకు బాధ పడుతుంది అని.. ఎందుకంటే ఆ కుటుంబం అంటే రాధా కు చాలా ఇష్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో రాధ కోపంగా కనిపిస్తుంది.

- Advertisement -