Devatha May 21 Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవి అన్న మాటలను తలచుకుని రాధ బాధ పడుతుంది. దేవి టిఫిన్ చేస్తుండగా దేవి ని చూస్తూ అలా ఎలా అనుకున్నావమ్మ అని బాధపడుతుంది. నేనే అమ్మ అని చెప్పుకునే పరిస్థితి వస్తుందనుకోలేదు అని బాగా బాధపడుతుంది.
సీన్ కట్ చేస్తే..
మరోవైపు దేవుడమ్మ ఒంటరిగా కూర్చొని కమల, భాష వాళ్ళతో భాగ్యమ్మ మాట్లాడిన మాటలను తలుచుకుంటూ ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా భాగ్యమ్మ ఎందుకు అలా మాట్లాడింది అని అనుకుంటుంది. అప్పుడే అక్కడి నుంచి రాజమ్మ రావటంతో రాజమ్మ కు కూడా భాగ్యమ్మ మాట్లాడిన మాటలు చెబుతుంది.
ఎమోషనల్ అయిన మాధవ..
భాష, కమల వాళ్ళు తమ బిడ్డను సత్య వాళ్ళకి ఇస్తామని అన్నారని.. దానికి భాగ్యమ్మ ఒప్పుకోలేదు అని అంటుంది. అంతేకాకుండా భాగ్యమ్మ మాటల వెనుక ఏదో విషయం ఉందని ఎలాగైనా ఆ విషయం కనిపెడతాను అని అంటుంది. ఇక మాధవ తన గదిలో ఒక కబోర్డులో ఉన్న తన మొదటి భార్య ఫోటోను చూసుకుంటూ ఎమోషనల్ అవుతున్నట్లు నటిస్తాడు.
అక్కడే ఉన్న దేవి మాధవ మాటలు వింటూ ఉంటుంది. ఇక మాధవ బంగారంకు నిన్ను చూపించలేని పరిస్థితి అని.. ఇప్పుడు తన తల్లిగా రాధ ఉంటుంది అని.. నీ దగ్గరికి తీసుకు వచ్చే పరిస్థితి కూడా లేదు అని కాసేపు తన మాటలతో డ్రామా చేసి.. అక్కడి నుంచి ఎమోషనల్గా వెళుతూ ఉంటాడు. దాంతో దేవి ఆ మాటలు విని ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్లి ఫోటో చూస్తుంది.
తన తల్లి రాధ కాదని అనుకున్న దేవి..
ఇక మాధవ డోర్ దగ్గర ఉండి దేవి చూసిందని క్రూరంగా సంతోష పడుతాడు. ఆ ఫోటో చూసిన దేవి తన తల్లి ఈమనే అని అనుకుంటుంది. మొత్తానికి మాధవ చేసిన ప్లాన్ వర్కౌట్ కావడంతో ఇకపై రాధ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆదిత్య ఒంటరిగా కూర్చొని ఉండగా అక్కడ నుంచి దేవుడమ్మ సత్యను హాస్పిటల్ కు తీసుకెళ్తుంది.
ఎందుకు అని ఆదిత్య అడగటంతో.. పిల్లల విషయంలో ఒకసారి చెకప్ చేస్తాను అని అనడంతో వెంటనే ఆదిత్య షాక్ అవుతాడు. గతంలో చూపించాను కదా మళ్లీ అదే చెబుతారు అనటంతో.. దేవుడమ్మ వెంటనే తను ఊర్లో కలిసిన ఒక పూజారి గురించి చెబుతుంది. ఊర్లో పూజారి దగ్గరికి వెళ్లిన దేవుడమ్మకు ఆ పూజారి ఆదిత్యకు సంతాన యోగం ఉందని అంటాడు.

Devatha May 21 Episode: రుక్మిణి బతికే ఉందని చెప్పిన దేవుడమ్మ..
అంతేకాకుండా రుక్మిణి బతికే ఉందని అనటంతో దేవుడమ్మ ఆశ్చర్యపోగా.. అది నిజమే అని ఆ పూజారి ఖచ్చితంగా చెప్పటంతో దేవుడమ్మ ఆ మాటలు అన్ని ఆదిత్య, సత్య లకు చెబుతుంది. దాంతో సత్య ఇది నిజమే అని కానీ ఎలా చెప్పను అని అనుకుంటుంది. ఆదిత్య కూడా రుక్మిణి బతికే ఉందని కాని తను మరొకరి భార్య అని ఎలా చెప్పను అని కుమిలిపోతాడు.