Devatha May 24 Episode: ఈరోజు ఎపిసోడ్ లో దేవుడమ్మ దేవిని తన ఇంటికి తీసుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. దాంతో దేవి ఇంట్లో ఎవరు మాట్లాడినా ఒక్క మాట కూడా మాట్లాడదు. అప్పుడే ఆదిత్య ఇంట్లోకి రావడం తో ఆదిత్య ని చూసి నవ్వుతుంది. ఆదిత్య లోపలికి రాగానే ఆఫీసర్ సర్ కు మంచినీరు ఇచ్చి భోజనం చేస్తావా అని అడగరా అంటూ దేవుడమ్మను, సత్యను గట్టిగా ప్రశ్నిస్తుంది.
దాంతో దేవుడమ్మతో పాటు సత్య కూడా ఆశ్చర్య పోయి నవ్వుకుంటారు. ఇంతసేపు మాతో మాట్లాడలేదు అని ఆదిత్య రాగానే మాటలు మాట్లాడటం ప్రారంభించిందని దేవుడమ్మ అంటుంది. ఇక దేవి కాసేపు ఆడుకుందాం అని అనటంతో అందరూ కలిసి కబడ్డీ ఆడతారు. ఆ తర్వాత దేవి మౌనంగా నిలబడటంతో దేవుడమ్మ వచ్చి అడగటంతో ఇంటికి వెళ్తాను అని అంటుంది. ఇక దేవుడమ్మ దేవిని తన కారులో తీసుకోని ఇంటికి బయలుదేరుతుంది.
సీన్ కట్ చేస్తే..
రాధ కోపంగా మాధవ దగ్గరికి వెళుతుంది. ఏమి చేస్తున్నారు సారు అని గట్టిగా అడుగుతుంది. ఆడదాని లోబర్చుకోవడానికి పసిపాప మనసును బాధ పెడతావా అని అంటుంది. అలా ఎందుకు చెప్పావు అని రాధ గట్టిగా నిలదీయడంతో మాధవ నేను చెప్పలేదు అంటూ గట్టిగా అంటాడు. ఇక రాధకు ఓపిక నశించడం తో తాను ఈ ఇంటి నుండి తన కూతుర్ని తీసుకుని వెళ్తాను అని అంటుంది.
దాంతో మాధవ ఎక్కడికి వెళ్తావు అని అడగటంతో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని ఏదో కూలి చేసి బతుకుతాను అని అంటుంది. కానీ మాధవ మాత్రం ఎక్కడికి వెళ్లేది లేదు అంటూ.. ఒకవేళ వెళ్ళినా కూడా నువ్వు మాత్రమే వెళ్తావు అని దేవి మాత్రం రాదు అని నమ్మకంతో అని అంటాడు. దాంతో రాధ షాక్ అవుతుంది. ఎందుకు రాదు అని అంటుంది.
తన అవ్వకు నిజం చెప్పిన దేవి..
ఈ తండ్రిని వదిలి దేవి నీ వెంట అస్సలు రాదు అని అనటంతో రాధ ఓ రేంజ్ లో ఫైర్ అయి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు దేవుడమ్మ దేవిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఏం జరిగింది అని అడగటంతో వెంటనే దేవి జరిగిన విషయం మొత్తం చెబుతుంది. తన తల్లి రాధ కాదని చెప్పటంతో దేవుడమ్మ షాక్ అవుతుంది. కానీ అమ్మగా ప్రేమించే అమ్మ ఉంటే చాలు రాధను ఉద్దేశించి అంటుంది.

Devatha May 24 Episode: రాధను కలవాలి అనుకుంటున్న దేవుడమ్మ..
రాధ ఇంటి దగ్గర బట్టలు ఆరవేస్తుండగా.. అక్కడికి దేవుడమ్మ, దేవి రాకను చూసి భయపడుతుంది. పెళ్లి ఇంట్లో దాచుకుంటుంది. ఇక దేవుడమ్మ ఇంట్లోకి వచ్చి తన తల్లిని పిలవడంతో.. దేవి ఇంట్లోకి రాధను పిలుస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తున్నాను అని అందుకే ఆ అవ్వ ఇక్కడకు తీసుకు వచ్చింది అని అంటుంది.