Devatha May 3 Episode: భయంతో వణికిపోతున్న దేవి.. షాక్ లో ఆదిత్య!

Akashavani

Devatha May 3 Episode: ఈ రోజు ఎపిసోడ్ లో ఆదిత్య.. ఓ వైపు మాధవ.. దేవి మాట్లాడిన మాటలు తల్చుకుంటారు. ఇక ఆదిత్య ఇలా నా కూతురుకు ఎంత కాలం దూరంగా ఉండాలి అని బాధపడుతూ ఉంటాడు. మాధవ బిడ్డను దత్తత కి ఇస్తా అని చివరికి మోసం చేశాడు అని.. అసలు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచనలో పడతాడు. ఇక మాధవ కూడా రాధ మాట్లాడిన మాటలను తలుచుకుంటాడు. రాధను ఎలాగైనా ఈ ఇంటి గడప దాటనివ్వకుండా చూడాలి అని.. అంటే దేవి తో మరింత ప్రేమగా మెలగాలి అని అనుకుంటాడు.

సీన్ కట్ చేస్తే..

ఉదయాన్నే ఆదిత్య నిద్రలేచి దేవి గురించి ఆలోచిస్తాడు. దేవిని సంతోష పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటే నా మనసు కుదుటుగా ఉండలేకపోతుందని అనుకుంటాడు. ఇక మాధవ చిన్మయి ని ఎందుకు దత్తత ఇస్తాడు అనేది ఎలాగైనా తెలుసుకోవాలి అని.. ఇది మాధవ నిర్ణయం కాబట్టి నేరుగా మాధవ నే అడిగి తెలుసుకోవడం మంచిది అని అనుకుంటాడు.

ఇంట్లో రాధ కూరగాయలు కట్ చేస్తూ కనిపిస్తుంది. అంతలోనే అక్కడకు మాధవ వచ్చి రాధను చూసి తన మనసులో రాధ పై ఉన్న ప్రేమ గురించి ఆలోచిస్తాడు. ఎలా చెప్పాలి అని మదన పడుతుంటాడు. అంతలోనే ఆదిత్య ఫోన్ చేయడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక ఆదిత్య మాట్లాడుతూ నీతో మాట్లాడాలి అంటూ మనిద్దరి మధ్య ఉండాల్సిన విషయము అని పర్సనల్ గా మాట్లాడాలి అని అంటాడు.

భయంతో వణికిపోతున్న దేవి..

ఓ వైపు పిల్లలిద్దరిని రాధ నిద్ర లేపుతుంది. ఇక దేవి తను నిద్ర లేవను అని.. పొద్దుగాల ఆఫీసర్ గారు నన్ను బలవంతంగా ఇంటికి తీసు కెళ్ళాడు అని మీరందరూ ఏడుస్తూ ఉన్నారు అని.. ఇప్పుడు లేస్తే ఆ ఆఫీసర్ సారు తీసుకెళ్తాడు అని అందుకే భయమేస్తుంది అని అంటుంది. ఆ మాటలకు రాధ ఏమి అనలేక మౌనంగా ఉంటుంది.

Devatha May 3 Episode: భయంతో వణికిపోతున్న దేవి.. షాక్ లో ఆదిత్య!
Devatha May 3 Episode: భయంతో వణికిపోతున్న దేవి.. షాక్ లో ఆదిత్య!

Devatha May 3 Episode: ఆలోచనలో పడ్డ మాధవ..

ఇక తమ కారులలో మాధవ, ఆదిత్య ప్రయాణిస్తూ మనసులో ఒకరి గురించి ఒకరు బాగా ఆలోచనలో పడతారు. ఆదిత్య ఎలాగైనా ఇవాళ నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు. మాధవ మాత్రం తనతో మాట్లాడే అవసరం ఏంటి అని అనుకుంటాడు. ఇక ఆదిత్య తనతో ఏం పర్సనల్ మాట్లాడాలి అనుకుంటున్నాడు అని మాధవ అనుకుంటాడు.

రాధ గురించా లేక దేవి గురించా అని ఆలోచిస్తాడు. మరోవైపు దేవుడమ్మ ఆదిత్య గురించి అడగటంతో ఉదయాన్నే నేను లేచేవరికి వెళ్ళిపోయాడు అని అంటుంది. ఈమధ్య ఆదిత్య సరిగా ఉండటం లేదు అని.. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఆలోచనలో పడుతున్నాడు అని అంటుంది. ఇక దేవుడమ్మ ఆదిత్య సమస్య గురించి నువ్వు తెలుసుకో.. నేను కూడా తెలుసుకుంటాను అని అంటుంది.

Devatha May 3 Episode: ఆ మాటకు షాకైన ఆదిత్య..

ఇక ఓ చోట మాధవ, ఆదిత్య కలుసుకోగా మాధవ కాస్త వెటకారం గా మాట్లాడుతూ ఉంటాడు. ఆదిత్య బిడ్డ ని ఎందుకు దత్తత ఇవ్వలేదు అనడంతో.. చిన్మయి ఇస్తా అన్నాను కదా అని అంటాడు. ఒకవేళ నేను చిన్నయిని తీసుకొని వెళితే అని ఆదిత్య అడగటంతో కచ్చితంగా పంపించే వాడిని అని మాధవ అంటాడు. ఇక ఆ మాటకు ఆదిత్య షాక్ అవుతాడు.

- Advertisement -