Devatha May 4 Episode: పిల్లలిద్దరికీ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మాధవ.. కోపంతో రగిలిపోయిన రాధ!

Akashavani

Devatha May 4 Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, మాధవ ఒకచోట కలుసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆదిత్య మాధవను దేవిని దత్తత ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడిగితే మాధవ మాత్రం దత్తత విషయంలో నిర్ణయం నాదే ఉంటుంది. కావాలంటే చిన్మయిని దత్తత తీసుకో అని అంటాడు. ఆ మాటకు ఆదిత్య షాక్ అవుతూ.. కన్న బిడ్డను దత్తత ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంటున్నావు మాధవ అని అంటాడు.

కన్న కూతురిని ఇవ్వడానికి సిద్ధమైన మాధవ..

దాంతో మాధవ నాకు చిన్మయిని ఇవ్వటానికి ఎటువంటి ఇబ్బంది లేదు అంటాడు. దేవి కూడా నా కూతురే.. కానీ చిన్మయిని మాత్రం దత్తత ఇస్తాను. ఇప్పటికీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక మాధవ మాటలకు ఆదిత్యకు ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచనలో పడతాడు.

సీన్ కట్ చేస్తే..

వంటగదిలో ఉన్న రాధ.. దేవి కి వచ్చిన కలను తలుచుకుంటూ ఉంటుంది. దేవికి ఇటువంటి కల వచ్చింది అంటే ఇంకా దేవి ఆ విషయంలోనే భయపడుతుంది అని ఎమోషనల్ గా అవుతుంది. ఓవైపు ఆదిత్యకు ఇవ్వాలని తన మనసు తాపత్రయపడుతోందని అనుకుంటుంది. ఇంట్లో నుంచి వస్తే ఇల్లంతా సంతోషం గా ఉంటుంది అనుకున్నాను కానీ ఆ సంతోషం నా దగ్గర ఉందని తెలుసుకోలేక పోయాను అని బాధపడుతుంది.

ఇక ఇంట్లో దేవి, చిన్నయి సరదాగా తమ తాత తో ఆడుకుంటూ కనిపిస్తారు. ఇక తమ తాత తో ఇద్దరు పిల్లలు గెలుస్తారు. అంతలోనే అక్కడికి జానకి రావటంతో రామమూర్తి కాసేపు జానకిని వెటకారం చేస్తాడు. దాంతో దేవి తన నానమ్మ గొప్పతనం గురించి, తన నానమ్మ చేసే పని గురించి చక్కగా చెప్పి తన తాతకు రివర్స్ తగిలేలా చేస్తుంది. ఇక ఈ సీన్ అక్కడ కాసేపు బాగా అనిపిస్తుంది.

పిల్లల కోసం గిఫ్ట్ తీసుకొచ్చిన మాధవ..

అదే సమయానికి అక్కడకు మాధవ పిల్లలను తన నుంచి దూరం చేసుకోను అని అనుకుంటాడు. అప్పుడే ఇంట్లోకి వెళ్లి పిల్లలతో నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి వారి మెడలో రాధ, మాధవ అనే ఇంగ్లీష్ లెటర్ లాకెట్ ను తీసుకువచ్చి వేయిస్తాడు. ఆది చూసి పిల్లలు ఇద్దరు సంతోషపడతారు. అంతలోనే రాధ అక్కడికి వచ్చి చైన్ మీద ఉన్న లెటర్లను చూసి షాక్ అయ్యే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Devatha May 4 Episode: పిల్లలిద్దరికీ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మాధవ.. కోపంతో రగిలిపోయిన రాధ!
Devatha May 4 Episode: పిల్లలిద్దరికీ ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మాధవ.. కోపంతో రగిలిపోయిన రాధ!

Devatha May 4 Episode: ఆలోచనలో పడ్డ ఆదిత్య..

మరోవైపు ఆదిత్య మాధవ మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు. మాధవ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా బాగా తెలివిగా సమాధానం ఇచ్చాడు అని అనుకుంటాడు. అసలు మాధవ తన కన్న బిడ్డను ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నాడు. దీని వెనుక ఏదో కారణం ఉంది అని అనుకుంటాడు. ఇక జానకి రాధకు తల దువ్వుతూ ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతుంది. ఇక జానకి ప్రశ్నలకు రాధ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది.

- Advertisement -