Devatha May 5 Episode: రాధతో మాధవ సెల్ఫీ.. భార్యభర్తలుగా రాధ, మాధవలను స్వీకరించిన రామమూర్తి!

Akashavani

Devatha May 5 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. జానకి రాధ తో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా ఉన్నావు అనటంతో రాధా ఏమీ చెప్పలేక పోతుంది. ఇక రామమూర్తి కూడా ఏం జరిగింది అని అంటుంటాడు. అప్పుడే పిల్లలు ఇద్దరు వచ్చి జానకి, రాధ లను చూసి మురిసిపోతారు. జానకి రాధకు జడ వేయడంతో పిల్లలు ఇద్దరు కూడా ఒక ప్లాన్ చేసి నలుగురు కలిసి జడలు వేసుకుంటారు. అది చూసిన మాధవ వారిని ఫోటో తీయాలి అనుకుంటాడు. మళ్లీ సెల్ఫీ కూడా తీస్తుండగా రాధ కోపంతో చూస్తూ వుంటుంది.

సీన్ కట్ చేస్తే..

సత్య ఒంటరిగా ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉండగా.. దేవుడమ్మ వచ్చి ఏం జరిగింది అని.. ఏదైనా కష్టం ఉంటే ఆదిత్య తో అయినా లేదా నాతో అయినా చెప్పుకోవాలి అనడంతో వెంటనే సత్య ఆదిత్య విషయం గురించి చెబుతుంది. ఆదిత్య దేని గురించో ఆలోచిస్తున్నాడు అని మౌనంగా ఉంటున్నాడు అని అంటుంది. దాంతో దేవుడమ్మ కూడా నేను అడిగితే మరింత ఆలోచనలో పడతాడు అంటూ ఈ విషయం పట్ల నువ్వే అడుగు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

అదే సమయంలో అక్కడికి ఆదిత్య రావడంతో సత్య ఆదిత్యను బతిమాలి టిఫిన్ చేయిస్తుంది. అంతేకాకుండా తన మౌనానికి, ఆలోచనలకి ఏం జరిగిందో అని ప్రశ్నలు కూడా వేస్తుంది. దాంతో ఆదిత్యకు అప్పుడే మాధవ మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో తినే ప్లేట్ ను పక్కకు నెట్టి మళ్లీ సత్యకు సారీ చెప్పి ఏం లేదని.. మీరు బాధపడాల్సింది ఏమీ లేదని సరిదిద్ది అక్కడినుంచి వెళ్తాడు.

సత్య, రాధల మాటలను చాటుగా విన్న మాధవ..

వెంటనే సత్యకు రుక్మిణి (రాధ) గుర్తుకు రావడంతో అక్క దగ్గరికి వెళ్లి తెలుసుకోవాలి అని అనుకుంటుంది. అనుకున్నట్టుగానే సత్య రుక్మిణి దగ్గరకు వెళ్లి నా మనసుకు కష్టం వచ్చిన పంచుకునేది నీ లాంటి అక్కతోనే కదా అని అంటుంది. ఎందుకో మా ఆయన సరిగా ఉండటం లేదు అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవ చాటున వారి మాటలు వింటూ ఉంటాడు.

ఇక దేవుడమ్మ తో మాట్లాడిన మాటలు, ఆదిత్యతో మాట్లాడిన మాటలు రాధ తో పంచుకుంటుంది.ఆ మాటలు విని రాధ షాక్ అవుతుంది. అక్కడే ఉన్న మాధవ ను చూసి కూడా షాక్ అవుతుంది. ఇక మాధవ ఆ మాటలు వినకూడదు అని మిక్సీ ఆన్ చేస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని రాధ అడగటంతో ఇదంతా నీ వల్ల ఏమైనా జరిగిందేమో అని అడుగుతున్నానని అంటుంది సత్య.

Devatha May 5 Episode: రాధతో మాధవ సెల్ఫీ.. భార్యభర్తలుగా రాధ, మాధవలను స్వీకరించిన రామమూర్తి!
Devatha May 5 Episode: రాధతో మాధవ సెల్ఫీ.. భార్యభర్తలుగా రాధ, మాధవలను స్వీకరించిన రామమూర్తి!

Devatha May 5 Episode: రామమూర్తి తీసుకున్న నిర్ణయం..

వారిద్దరూ అక్కడి నుంచి బయటికి వస్తుండగా మాధవ ఎదురు పడుతాడు. సత్య అక్కడ వారితో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. వెంటనే మాధవ నీ గతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావద్దు అని అంటాడు. తరువాయి భాగం లో కొందరి జంటలకు పెళ్లిళ్లు చేయడానికి రామమూర్తి.. పెళ్లి పెద్దగా మాధవ, రాధలను భార్యాభర్తలుగా ముందుంచడానికి ఒప్పుకుంటాడు.

- Advertisement -