Devatha May 6 Episode: దేవత సీరియల్ లో ట్విస్ట్.. చిన్మయినే తన కూతురు అనుకుంటున్న ఆదిత్య.. నువ్వు మా అమ్మవేనా అంటూ దేవి ప్రశ్న!

Akashavani

Devatha May 6 Episode: ఈరోజు ఎపిసోడ్ లో రాధ దగ్గరకు వచ్చిన సత్య తన బాధను చెప్పుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక మాధవ నీ గతాన్ని గురించి మాట్లాడే వ్యక్తులు ఈ ఇంటికి రావద్దు అనడంతో వెంటనే రాధ షాక్ అవుతుంది. ఇక మరోవైపు ఆదిత్య సత్య కోసం చూస్తూ ఉండగా అప్పుడే దేవుడమ్మ వచ్చి ఆదిత్య ఆలోచనలకు కారణం గురించి అడుగుతుంది.

తల్లి మాటలకు మాటిచ్చిన ఆదిత్య..

మా సంతోషం కోసం నువ్వు ఇలా ఉంటే ఇంకా బాధ పడతాం అనడంతో ఆదిత్య ఇకపై అలా ఉండడు అని అంటాడు. ఇక ఇంట్లో చిన్మయి, దేవి సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అది చూసిన రాధ సంతోషంగా ఫీల్ అవుతూ గతంలో దేవి మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటుంది. అప్పుడే రామమూర్తి దంపతులు పిల్లల దగ్గరకు రావడంతో పిల్లలు తమ తో కాసేపు ఆడమని అంటారు.

రామమూర్తి మాటలకు షాక్ అయిన రాధ..

ఇక పిల్లలతో పాటు రామమూర్తి దంపతులు సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అంతలోనే అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చి ఊరిలో కొన్ని జంటలకు కళ్యాణం చేస్తున్నాము అని.. దానికి మీ కొడుకు కోడలి చేతుల మీద జరగాలి అనడంతో దానికి రామమూర్తి కాసేపు ఆలోచించి ఆ తర్వాత వారితో సరే అంటాడు. ఆ మాటలు విన్న రాధ వెంటనే షాక్ అవుతుంది.

ఇక వాళ్లకి మాధవ ఎదురవడంతో మీరు చెప్పినట్లుగానే మీ నాన్నను కలిశామని అంటారు. దీని బట్టి చూస్తే ఇదంతా మాధవ ప్లాన్ అని అర్థమవుతుంది. ఓవైపు ఆదిత్య ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సత్య కమలతో ఫోన్ మాట్లాడి ఆదిత్య దగ్గరికి వస్తుంది. నన్ను వదిలేసి అక్క వెళ్ళిపోయింది అని పదే పదే అక్క అక్క అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

Devatha May 6 Episode: దేవత సీరియల్ లో ట్విస్ట్.. చిన్మయినే తన కూతురు అనుకుంటున్న ఆదిత్య.. నువ్వు మా అమ్మవేనా అంటూ దేవి ప్రశ్న!
Devatha May 6 Episode: దేవత సీరియల్ లో ట్విస్ట్.. చిన్మయినే తన కూతురు అనుకుంటున్న ఆదిత్య.. నువ్వు మా అమ్మవేనా అంటూ దేవి ప్రశ్న!

Devatha May 6 Episode: ఆలోచనలో పడ్డ ఆదిత్య..

ఆ తర్వాత ఆదిత్య ఆ మాటలు తలుచుకొని దేవి కూడా చిన్మయి ని అక్క అక్క అంటుందని ఆ మాటలు గుర్తు చేసుకొని వెంటనే ఆదిత్య ఆలోచనలో పడతాడు. అంటే చిన్మయి పెద్ద కాబట్టి చిన్మయి నా కూతురేనా అని అనుకుంటాడు. ఇక రామమూర్తి రాధ, మాధవ లను పిలిచి ఊరిలోనే జరిగే కళ్యాణం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ కళ్యాణం కు మీరే దగ్గర ఉండి చెయ్యాలి అనడంతో వెంటనే రాధ కోపం అవుతుంది.

అలా ఎలా నిర్ణయం తీసుకుంటారు అని గట్టిగా అడగటంతో రామమూర్తి సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. మాధవ కూడా బయటికి నటిస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇక తరువాయి భాగంలో మాధవ వేరే వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడటం తో దేవి చాటున వింటుంది. మాధవ పిల్లలతో కలిసి బయటికి వెళ్తున్న సమయంలో రాధ రాకపోయేసరికి వెంటనే దేవి అసలు ఎక్కడికి రావు నువ్వు మా అమ్మవేనా అని ప్రశ్నిస్తుంది.

- Advertisement -