Devatha May 7 Episode: రాధే నా భార్య అంటూ షాక్ ఇచ్చిన మాధవ.. అసలు నిజం తెలుసుకున్న దేవి!

Akashavani

Devatha May 7 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. రామమూర్తి రాధను, మాధవను భార్య భర్తలు గా ఉండి పెళ్లి పెద్దగా ఉండమని అంటాడు. దాంతో మాధవ పైకి నటిస్తూ ఎందుకు ఇలా అని అంటాడు. రాధ మాత్రం కోపం తో రగిలిపోతుంది. ఇక రామమూర్తి తనను ఊర్లో వాళ్లంతా మీ కోడలు ఎందుకు రావటం లేదు అని పదేపదే అడుగుతున్నారని ఇక ఇప్పుడు రాకపోతే పరువు పోతుందని అంటాడు. ఎలాగైనా రావాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని మాధవ కాస్త సంతోష పడతాడు.

సీన్ కట్ చేస్తే..

రాధ, జానకి పిల్లలిద్దరికీ జడలు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో పిల్లలు తొందరగా వెళ్ళాలి అని తొందర పెడతారు. మేము నాన్నతో షాపింగ్ కు వెళ్తున్నాము అని మమ్మల్ని త్వరగా పంపించండి అంటారు. అంతేకాకుండా కాసేపు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మాధవ వచ్చి పిల్లలిద్దర్నీ తీసుకుని వెళుతూ ఉండగా పిల్లలు రాధను రమ్మని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఇక మాధవ కారు దగ్గరికి పిల్లలను తీసుకు వస్తున్న సమయంలో అక్కడికి లక్ష్మీ తల్లి తండ్రులు వస్తారు.

ఇబ్బందిగా ఫీల్ అయిన మాధవ..

వారిని చూసి మాధవ కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తాడు. ఇక వాళ్ళు తమ మనుమరాలిని చూడాలని వచ్చాము అనటంతో పిల్లలిద్దర్నీ కారులో కూర్చోబెట్టి వాళ్లని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. ఇంట్లో రామమూర్తి, జానకి వాళ్లను పలకరించి వారి పనులు వారు చూసుకుంటారు. ఇక మాధవ వాళ్లతో పాటు రాధ ను కూడా ఒక చోటకు పిలిచి అక్కడ మాధవ తన భార్య జ్ఞాపకాలు వాళ్లకు ఇచ్చేస్తాడు.

ఆ మాటతో షాక్ అయిన రాధ..

తన భార్య చనిపోయాక తను ఏవి పట్టించుకోలేదు అని.. ఆ సమయంలోనే రాధ తన జీవితంలోకి వచ్చిందని అంటాడు. అంతేకాకుండా రాధే నా భార్య అని అనడంతో రాధ కోపంతో రగిలిపోతూ కనిపిస్తుంది. ఇక కారులో ఉన్న దేవి నేను వెళ్లి అమ్మని పిల్చుకు వస్తాను అని లోపలికి వెళ్తుంది. మరోవైపు మాధవ పిల్లల గురించి చెబుతూ ఇకపై తమ తల్లి రాధ అనటంతో ఆ మాటలు దేవి విని.. ఇంతకు మా అమ్మ ఎవరు అని ఆలోచనలో పడుతుంది.

Devatha May 7 Episode: రాధే నా భార్య అంటూ షాక్ ఇచ్చిన మాధవ.. అసలు నిజం తెలుసుకున్న దేవి!
Devatha May 7 Episode: రాధే నా భార్య అంటూ షాక్ ఇచ్చిన మాధవ.. అసలు నిజం తెలుసుకున్న దేవి!

Devatha May 7 Episode: నువ్వు మా అమ్మ వేనా అంటూ రాధను ప్రశ్నించిన దేవి..

ఆ తర్వాత మాధవ పిల్లలను తీసుకెళ్తుండగా రాధ రాకపోవడంతో వెంటనే దేవి అసలు నువ్వు మా అమ్మవేనా అంటుంది. దాంతో రాధ షాక్ అవుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అందరూ కలిసి చెరుకు రసం తాగడానికి రోడ్డుపై నిలబడతారు. అప్పుడే ఆదిత్య అక్కడికి రావడంతో పిల్లలు ఇద్దరు ఆదిత్య దగ్గరికి వెళ్లి ఆదిత్య ను కూడా చెరుకు రసం తాగమని బ్రతిమాలుతూ ఉంటారు.

- Advertisement -