Devatha May 9 Episode: బిడ్డ కోసం ఎంక్వయిరీ చేస్తున్న ఆదిత్య.. మాధవను ప్రమాదం నుంచి కాపాడిన రాధ..

Akashavani

Devatha May 9 Episode: ఈరోజు ఎపిసోడ్ లో.. పిల్లలిద్దరూ ఆదిత్యను చెరుకు బండి దగ్గరికి తీసుకు వచ్చి చెరుకు రసం తాగమని బ్రతిమాలుతూ ఉంటారు. కానీ ఆదిత్య తాగడానికి నిరాకరిస్తాడు. పక్కనే ఉన్న రాధ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఆదిత్య ఇబ్బందిగా ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మాధవ ఆదిత్య కారు దగ్గరకు వచ్చి తన మాటలతో వార్నింగ్ ఇచ్చినట్లు కనిపించగా వెంటనే ఆదిత్య కూడా నాకు చేత కాదు అన్నట్టుగా మాట్లాడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

పిల్లల గురించి ఎంక్వయిరీ చేస్తున్న ఆదిత్య..

ఇక రాధను చెరుకు రసం తాగమని అంటాడు మాధవ. ఆదిత్య నేరుగా దేవి, చిన్మయిల స్కూల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ హెడ్ మాస్టర్ తో దేవి, చిన్మయి ల అడ్మిషన్ రిజిస్టర్ అడుగుతాడు. అడ్మిషన్ రిజిస్టర్ లో తల్లి పేరు ఎవరున్నారో చూడటానికి ఈ విధంగా ఎంక్వయిరీ చేస్తున్నాను అని అనుకుంటాడు. దాంతో రిజిస్టర్ చూడగానే అందులో దేవి, చిన్నయిల తల్లి తండ్రి పేరు స్థానంలో రాధ, మాధవ అని ఉండటంతో ఆదిత్య షాక్ అవుతాడు.

మరోపక్క దేవి.. లక్ష్మీ తల్లి తండ్రులతో మాధవ మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని బాగా ఆలోచనలో పడుతుంది. ఇంతకు తన తల్లి ఎవరు అని.. చనిపోయిన ఆవిడ మా అమ్మనా లేదా ఇప్పుడున్న ఆవిడ మా అమ్మనా అనుకుంటూ సతమతమవుతుంది. అప్పుడే రాధతో ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు అని అడగటం తో రాధ సమాధానం ఇస్తుంది.

అంతేకాకుండా దేవి అడిగిన ప్రశ్నలకు షాక్ అవుతుంది. వాళ్లు అలా ఎందుకు మాట్లాడారు అని అనడంతో సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ తర్వాత పిల్లల స్కూల్ హెడ్మాస్టర్ మాధవకు ఫోన్ చేసి ఆదిత్య పిల్లల గురించి ఎంక్వయిరీ చేయడానికి వచ్చాడు అని అనడంతో మాధవ షాక్ అవుతాడు. ఈ విధంగా ఎంక్వైరీ చేస్తున్నావా అని మాధవ అనుకుంటాడు.

మాధవ పై అరిచిన రాధ..

ఇక రాధ దగ్గరికి మాధవ వెళ్లగా అక్కడ రాధ కోపం తో రగిలిపోతుంది. లక్ష్మీ వాళ్ళ తల్లిదండ్రులతో ఎందుకు అలా మాట్లాడావు అని అంటుంది. దాంతో మాధవ సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటాడు. అంతేకాకుండా రాధ ఊరిలో వారి కళ్యాణం కోసం తాను తన పెనిమిటికి మోసం చేయను అని నీకు భార్య స్థానంలో ఉండను అని గట్టిగా అంటుంది. నీకు భార్య స్థానంలో ఉండటానికి ఎలా ఒప్పుకున్నావు అని అనడంతో ఆ నిర్ణయం ఊరి వాళ్లది అని అంటాడు.

Devatha May 9 Episode: బిడ్డ కోసం ఎంక్వయిరీ చేస్తున్న ఆదిత్య.. మాధవను ప్రమాదం నుంచి కాపాడిన రాధ..
Devatha May 9 Episode: బిడ్డ కోసం ఎంక్వయిరీ చేస్తున్న ఆదిత్య.. మాధవను ప్రమాదం నుంచి కాపాడిన రాధ..

Devatha May 9 Episode: మాధవను కాపాడిన రాధ..

దీంతో నీకు భార్యగా ఉండటానికి నేను ఒప్పుకోను అని అనడంతో అప్పుడే రామమూర్తి వచ్చి ఆ వేడుకకు సిద్ధం కావాలి అని కాస్త గట్టిగానే చెబుతాడు. కానీ రాధ మాత్రం తాను గుడి కి రాను అని గట్టిగా చెబుతోంది. తరువాయి భాగంలో మాధవ కింద పడి పోతూ ఉండగా అక్కడ ఉన్న ప్రమాదం నుంచి రాధ కాపాడుతుంది. దీంతో అక్కడున్న వాళ్ళందరూ మంచి భార్య అని తనను పొగుడుతారు. ఆ తర్వాత భార్య భర్త స్థానంలో వారి ఫోటోలు చూసి రాధా షాక్ అవుతుంది.

- Advertisement -