Guppedantha Manasu April 27 Episode: ఇంట్లో వాళ్ళకు షాక్ ఇచ్చిన రిషి.. తట్టుకోలేకపోతున్న దేవయాని!

Akashavani

Guppedantha Manasu April 27 Episode: ఈరోజు ఎపిసోడ్ లో వసు తన రూమ్ లో ఒంటరిగా ఉండగా అక్కడ ఎవరో వ్యక్తి వచ్చి డోర్ కొట్టడంతో వసు తెగ భయపడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో రిషి కి ఫోన్ చేస్తూ కాల్ లిఫ్ట్ చేయండి సార్ అంటూ వణికిపోతుంది. ఇక అంతలోనే డోర్ ఓపెన్ కావడంతో చూసే సరికి రాజీవ్ ఉంటాడు. ఇక రాజీవ్ ను చూసి వసు షాక్ అవుతుంది. వెంటనే రాజీవ్ ఈ పాడు లోకం నుండి దూరంగా వెళ్లిపోదాం వసు అంటూ వసు లాక్కొని వేరే దారి నుంచి తీసుకొని వెళ్తాడు.

సీన్ కట్ చేస్తే..

రిషి అక్కడ ఎంట్రీ ఇచ్చి రాజీవ్ కు షాక్ ఇస్తాడు. ఇక వసు కూడా రిషిని చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే రిషి రాజీవ్ చెయ్యి పట్టుకొని నువ్వు ఇక్కడికి వస్తావని తెలిసే ఇక్కడ ఎదురుచూస్తూ ఉన్నానని అంటాడు. ఇక రాజీవ్, రిషి మధ్య ఫైట్ జరుగుతుంది. వసు ఎంత అడ్డు ఆపిన వారిద్దరి మధ్య మాత్రం బాగా ఫైట్ జరుగుతుంది. ఇక రాజీవ్ రిషి చేతికి గాయం చేయడంతో అది చూసి వసు రిషి సార్ అని అరుస్తుంది.

రిషి చేతికి గాయం..

ఇక రిషి అంతటితో ఆగకుండా రాజీవ్ ను కొడతాడు. ఏమి చేసేది లేక రాజీవ్ అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే వసు రిషి గాయానికి తన వోని కట్ చేసి కడుతుంది. అంతే కాకుండా బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక రిషి నువ్వు ఇలా ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదు అని కాస్త కోపంగానే మందలిస్తాడు. వసు మాత్రం ఒకరోజు పుష్ప వాళ్ళ ఇంటికి వెళ్తాను అనడంతో.. మరి రేపటి నుంచి అని ప్రశ్నిస్తాడు.

నీ వెనుక నేను ఉన్నాను అంటూ రిషి..

దాంతో వసు ఏమి చెప్పలేక మొత్తం ప్రశ్నార్థకంగా మారింది అనడంతో.. దానికి సమాధానం నేను అంటూ.. ఇకపై ప్రతి విషయంలో నీకు నేను తోడుగా ఉంటాను అని మాట ఇస్తాడు. ప్రతి కష్టం వెనుక నేను ఉంటాను అని అనడంతో వసు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక రిషి తన మనసులో.. ఎందుకు అని అడగకు వసుధార అని అనుకుంటాడు. వెళ్లి లగేజ్ తీసుకొనిరా అని అనడంతో వసు ఎక్కడికి అని అంటుంది. ఇక రిషి గట్టిగా అనటంతో వసు లగేజి కోసం వెళ్తుంది.

Guppedantha Manasu April 27 Episode: ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చిన రిషి..

మరోవైపు ఇంట్లో అందరూ నిద్రపోకుండా రిషి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. మధ్యలో దేవయాని తనకే రిషిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది. అంతేకాకుండా మహేంద్ర ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. ఇక రిషి తన ఇంటి దగ్గరికి వసును తీసుకొని వస్తాడు. వసు ఇబ్బంది పడటం తో రిషి లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ వీరిద్దరిని చూసి షాక్ అవుతారు. దేవయాని మాత్రం రిషి వసు ను లగేజీ తో తీసుకొని రావడాన్ని సహించలేకపోతోంది. మొత్తానికి వసు కూడా రిషి ఇంట్లో సెటిల్ అయిపోయింది.

- Advertisement -