Devi Nagavalli: ముదిరిన వివాదం.. దేవి నాగవల్లి భర్త గురించి ట్వీట్స్.. సంవత్సరానికే విడాకులు తీసుకున్నారంటూ?

Akashavani

Devi Nagavalli: ప్రముఖ జర్నలిస్టుగా, న్యూస్ రీడర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దేవి నాగవల్లి గురించి అందరికీ తెలిసిందే. ఈమె టీవీ యాంకర్ గా మాత్రమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న దేవి నాగవల్లి తాజాగా హీరో విశ్వక్ సేన్ ఫ్రాంక్ వీడియో డిబేట్ ద్వారా సంచలనంగా మారారు. ప్రస్తుతం ఈ డిబేట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ఈ నెల 6వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ ప్లాన్డ్ గా ఒక ఫ్రాంక్ వీడియో ప్లాన్ చేశారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేయగా అడ్వకేట్ అరుణ్ ఈ విషయం పై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫ్రాంక్ వీడియో పై దేవి నాగవల్లి చిత్ర పరిశ్రమకు చెందిన త్రిపురనేని చిట్టితో డిబెట్ నిర్వహించారు.

Devi Nagavalli: దేవి నాగవల్లి మొగుడు అదృష్టవంతుడు.. సంవత్సరానికే విడాకులు ఇచ్చాడు!
Devi Nagavalli: దేవి నాగవల్లి మొగుడు అదృష్టవంతుడు.. సంవత్సరానికే విడాకులు ఇచ్చాడు!

Devi Nagavalli: అదృష్టవంతుడు…

ఈ డిబేట్ లో భాగంగా దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ఫాగల్ సేన్ అంటూ అతని గురించి దురుసుగా మాట్లాడారు. ఈ క్రమంలోనే ఈ డిబేట్ మధ్యలోకి ఎంటరైన విశ్వక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. దేవి నాగవల్లి, విశ్వక్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

Devi Nagavalli: దేవి నాగవల్లి మొగుడు అదృష్టవంతుడు.. సంవత్సరానికే విడాకులు ఇచ్చాడు!
Devi Nagavalli: దేవి నాగవల్లి మొగుడు అదృష్టవంతుడు.. సంవత్సరానికే విడాకులు ఇచ్చాడు!

ఈ క్రమంలోనే దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ ను గెటవుట్ అంటూ అతనిని దారుణంగా అవమానించారు. అయితే ప్రస్తుతం ఈ డిబేట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా దేవి నాగవల్లి భర్త గురించి మాట్లాడుతూ ఎంతో అదృష్టవంతుడు అందుకే ఒక సంవత్సరానికి విడాకులు ఇచ్చాడు అంటూ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తావిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -