Devi Sri Prasad: సినీ ప్రియులకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక స్వచ్ఛమైన సంగీతానికి దేవి శ్రీ ప్రసాద్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. తెర వెనక మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో ఆసక్తికరంగా పని చేస్తాడు. అదే జోష్ తో మైక్ పట్టుకొని తన టాలెంట్ ను కనబరిచాడు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారి.. స్టార్ హీరోలకి ఫస్ట్ ఛాయిస్ గా మారాడు దేవి శ్రీ ప్రసాద్. మొత్తానికి మ్యూజిక్ అంటే దేవి.. దేవి అంటే మ్యూజిక్ అని అనుకునే స్థాయికి ఈ రాక్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఈ త్వరలో విడుదల కాబోతున్న ఎఫ్ త్రి సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ తన అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ కొన్ని విషయాలను బయట పెట్టాడు. ఒక సినిమాకి సంగీతాన్ని అందించే ముందు ఆ కథని అర్థం చేసుకుంటాను అన్నట్లు తెలిపాడు. ఇక డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ కావాలి అనుకుంటున్నాడో అర్ధం చేసుకొని, నా స్టైల్ మిస్ కాకుండా సంగీతం అందిస్తానని దేవిశ్రీప్రసాద్ వెల్లడించాడు. ఇక అనిల్ రావిపూడి ఎంత త్వరగా సినిమాలు తీసిన బాగా తీయడం తన లోని ప్రత్యేకత అని చెప్పుకొచ్చాడు.

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ ఈ విధంగా చెబుతూ తన మనసులోని మాటను బయట పెట్టాడు!
ఇక ఎఫ్ 3 సినిమాలో పాటలకు చాలా ఆదరణ ఉంటుందని దేవిశ్రీ తెలిపాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో అన్ని పాటలకు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక దక్షిణాది లో అన్ని భాషల వాళ్ళు ఎక్కువగా ఉండేది చెన్నై లోనే..అక్కడ చాలా మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి. ఒక సంగీత పాఠశాల స్టార్ట్ చేసి ఉచితంగా సంగీతం నేర్పించాలని ఆలోచన ఉంది. అది చేయాలంటే కొంత టైం పడుతుంది అని దేవిశ్రీ తన మనసులోని మాట బయటపెట్టాడు.