Devi Sri Prasad: ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మాణంలో శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు దేవీశ్రీప్రసాద్. మొదటి సినిమా పాటలకు, నేపథ్యానికి అద్భుతమైన సంగీతం అందించడంతో ఒక్కసారిగా దేవీశ్రీప్రసాద్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ తర్వాత డీఎస్పీ గా ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. దేవీ మ్యూజిక్ సంగీతం అందిస్తున్నారంటే ఆడియో పరంగా సినిమా సూపర్ హిట్ అని అందరూ ఫిక్సైయ్యేవారు.
చిన్న హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు దాదాపు తెలుగులో అందరు హిరోల సినిమాలకు రాక్ స్టార్ సంగీతం అందించాడు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డీఎస్పీ చేసే సందడితోనే సినిమా హిట్ అని ఆడియన్స్ గట్టిగా ఫిక్సైపోతారు. అంతగా సినిమాకు తన సపోర్ట్ ఇస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎస్ ఎస్ థమన్, తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ చేస్తున్న మ్యూజిక్ ప్రమోషన్స్ ఒకప్పుడు దేవీ చేసిందే. కాకపోతే ఇప్పుడు వీరు ఇంకా ఎక్కువ బడ్జెట్‌తో ఒక్కో సాంగ్‌ని ప్రమోట్ చేస్తున్నారు.
Devi Sri Prasad : అదే దేవీకి ఇప్పుడు కాస్త మైనస్ అయింది.
అదే దేవీకి ఇప్పుడు కాస్త మైనస్ అయింది. గతకొంతకాలంగా దేవీ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయలేకపోతున్నారు. ఉప్పెన సినిమాకు మంచి పేరొచ్చినా అది నిలబడలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడితే దేవీ రేంజ్ వేరే లెవల్. కానీ, దేవీ కంటే ఇక్కడ థమన్, అక్కడ అనిరుధ్ వరుస సినిమాలతో సత్తా చాటుతూ హై రేంజ్‌లో నిలబడ్దారు. దాంతో రేస్‌లో కాస్త డీఎస్పీ వెనకబడ్దారు. చూడాలి మరి త్వరలో రాబోతున్న సినిమాలతో మళ్ళీ తన మార్క్ చూపించి చెక్ పెడతారేమో.