Dhee Show: ఢీ డ్యాన్స్ షోలో కన్నీళ్లు పెట్టిన హీరోయిన్.. ఆ ఒక్కటి చూసి ఒకటే ఏడుపు!

Akashavani

Dhee Show: ప్రియమణి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ పై పలు స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఇక ఇటీవల నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన నటించి నటనలో ప్రేక్షకుల విమర్శలకు ప్రశంసలందుకుంది. ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ఢీ షో లో జడ్జి గా వ్యవహరిస్తూ.. ప్రేక్షకులకు తన గ్లామర్ విండును వడ్డీస్తుంది. ఇక ప్రియమణి డీ షో కి అడుగుపెట్టి ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో కొరియోగ్రఫర్ సాయి ప్రియమణి లైఫ్ స్టోరీ ను ఒక పర్ఫామెన్స్ ద్వారా బయట పెట్టాడు.

సినిమాల్లోకి రాకముందు ప్రియమణి పడిన కష్టాలు ఒడిదుడుకులు ఆమె లవ్ మ్యారేజ్ గురించి పలు విషయాలు ఎమోషనల్ గా టచ్ చేస్తూ తన పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. ఈ క్రమంలో ప్రియమణి తన భర్త ని గుర్తు చేసుకుని ఎంతో బాధపడింది. పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత ప్రియమణికి సాయి వాళ్ల అమ్మమ్మతో కలిసి దిగిన పెయింటింగ్ ను గిఫ్టుగా ఇస్తాడు

Dhee Show: ఢీ డ్యాన్స్ షోలో కన్నీళ్లు పెట్టిన హీరోయిన్.. ఆ ఒక్కటి చూసి ఒకటే ఏడుపు!
Dhee Show: ఢీ డ్యాన్స్ షోలో కన్నీళ్లు పెట్టిన హీరోయిన్.. ఆ ఒక్కటి చూసి ఒకటే ఏడుపు!

Dhee Show: ప్రియమణి ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఈమెనే!

ఇక ఆ పెయింటింగ్ ను చూసిన ప్రియమణి ఒక్కసారిగా కన్నీళ్లను ఆపుకోలేక పోతుంది. నిజానికి ప్రియమణి నటిగా ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన అమ్మమ్మ అన్నట్టు తెలిపింది. అంతేకాకుండా నేషనల్ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారణం కూడా తానే అని చెప్పుకు వచ్చింది. ఇక వాళ్ళ అమ్మమ్మ సపోర్టు లేకపోతే ఆమె ఈ స్థాయికి వచ్చేది కాదని ప్రియమణి ఎమోషనల్ అయ్యింది.

ప్రస్తుతం ప్రియమణి ఎమోషనల్ గా తన అమ్మమ్మ గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. మీరు కూడా ఆ వీడియో పై ఒక లుక్కేయండి.

- Advertisement -