Dhethadi Harika: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకొని తమలో ఉన్న టాలెంట్ బయట పెడుతూ పలు వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. ఈ విధంగా కొందరి వీడియోలు బాగా పాపులర్ అవడమే కాకుండా ఏకంగా వారికి బుల్లితెరపై వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన వారిలో అలేఖ్య హారిక ఒకరు. అయితే ఈమె దేత్తడి అనే ఛానల్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడంతో ఈమె దేత్తడి హారికగా పేరు సంపాదించుకున్నారు.
దేత్తడి అనే ఛానల్ ద్వారా పరిచయమైన ఈమెకు ఎంతో పాపులారిటీ రావడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశం అందుకొని ఈ కార్యక్రమాల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో హారిక యంగ్ హీరో అభిజిత్ తో లవ్ ట్రాక్ నడిపిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అప్పటినుంచి వీరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో ఆట ఆడుతూ ఏకంగా ఐదవ స్థానంలో నిలిచారు.ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా 40 లక్షల రూపాయలు సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.

Dhethadi Harika: హాట్ సెల్ఫీకి ఫోజులు ఇచ్చిన హారిక…
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే హారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోని సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నిత్యం హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు. అయితే తాజాగా ఈమె ఒక సెల్ఫీ ఫోటో దిగారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.ఈ ఫోటోలో ఈమె కేవలం ఇన్నర్స్ మాత్రమే ధరించి ఫోటో దిగడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజెన్లు ఈ ఫోటోపై స్పందిస్తూ తనపై విమర్శలు చేశారు.అసలు దానిని డ్రెస్ అంటారా అంటూ కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.