Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనుష్క శెట్టి ఒకరు ఈమె సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుష్క బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. మరి ఇంత స్టార్ సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎవరు అంటే అందరం కూడా పూరీ జగన్నాథ్ అని చెబుతాము. పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా ఈమె పరిచయం కావడంతో పూరినే తనకు అవకాశాలు ఇచ్చారని అందరం భావిస్తాను కానీ నిజం ఇది కాదు.
పూరి జగన్నాథ్ సూపర్ సినిమా చేసే సమయంలో తన సినిమాలో సెకండ్ హీరోయిన్ కావాలని నటుడు సోనూ సూద్ ను అడిగారట. ఎవరైనా కొత్త అమ్మాయిలు ఉంటే చూడు అని చెప్పడంతో ఈయన కూడా సరేనని అన్నారు. అయితే ప్రతిరోజు యోగ క్లాస్ కి వెళ్లే సమయంలో సోను సూద్ అనుష్కను చూసేవారట . ఎప్పుడు వీరిద్దరూ మాట్లాడుకోకపోయినా ఒకరికి మరొకరు ఎదురుపడితే చిన్నగా నవ్వుకునే వారట అయితే ఈ అమ్మాయి హీరోయిన్ గా చాలా బాగుంటుందని భావించిన సోను సూద్ యోగ టీచర్ దగ్గర అనుష్క ఫోన్ నెంబర్ తీసుకొని పూరీ జగన్నాథ్ కు ఇచ్చారట.
సోను సూద్ కారణమా…
ఇక పూరి జగన్నాథ్ అనుష్కకు ఫోన్ చేయడం ఆమెను రమ్మని ఆడిషన్ ఇప్పించడం అన్ని అయిపోయి హీరోయిన్గా సెలెక్ట్ అయింది అయితే అదే సమయంలో సోనూసూద్ అక్కడ ఉండడంతో మీరేంటి ఇక్కడ అని అనుష్కను ప్రశ్నించారట ఆ సమయంలో పూరీ జగన్నాథ్ మీకు ఈ ఛాన్స్ వచ్చిందంటే తన కారణం అంటూ జరిగినది మొత్తం చెప్పారు. అలా పూరి జగన్నాథ్ కాకుండా సోను సూద్ అనుష్కను ఇండస్ట్రీకి పరిచయం చేశారని చెప్పాలి ఇలా ఈ విలన్ కారణంగానే ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.