Rohini : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదని చెప్పాలి. కెరీర్ మొదట్లో సీరియల్ ఆర్టిస్టుగా పనిచేసిన రోహిణికి సీరియల్ సమయంలో నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ సమయంలో కొంతకాలం సీరియల్స్ కు దూరం కాగా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ షో నుండి బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారడమే కాకుండా.. బుల్లితెరపై పలు షోలల్లో అవకాశాలు కూడా అందుకుంది.
అలా జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర ఎంటర్టైన్మెంట్ షో లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది. ఆమధ్య సేవ్ ద టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా చేయగా.. అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. వెండితెరపై పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పంచుకుంటూ బాగా సందడి చేస్తూ ఉంటుంది.
అయితే ఈమెను చూస్తే ఈమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనే ఫీలింగ్ ఎవరికి కనిపించదు. ఎందుకంటే ఈమె చాలా న్యాచురల్ అమ్మాయిగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. కానీ తనకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న విషయం స్వయంగా తనే తెలిపింది. తాజాగా జీ తెలుగులో నీకు నేను నాకు నువ్వు అనే షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. అందులో యాంకర్ రవితో పాటు తను కూడా యాంకరింగ్ చేస్తూ కనిపించింది.
Rohini :
అంతేకాకుండా తను అద్భుతమైన లవ్ సాంగ్ కూడా పాడింది. ఇక ఆ పాట పాడటంతో ఆ ఫీలింగ్ లో.. తనకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండేది అని అనటంతో వెంటనే యాంకర్ రవి ఎవరిని లవ్ చేయలేదా నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని ప్రశ్నించాడు. దాంతో రోహిణి ఉండేవాడని కానీ బ్రేకప్ జరిగింది అని.. ఆ సమయంలో డిప్రెషన్ కి వెళ్తే తన ఫ్రెండ్స్ అందులో నుంచి బయటికి తీసుకొచ్చారని తెలిపింది. అంతేకాకుండా వాడు నీ కాలి గోటికి కూడా పనికిరాడు అని తన ఫ్రెండ్స్ అన్నారని.. దాంతో తను కూడా వాడు ఆఫ్ట్రాల్ అనుకున్నాను అని చెప్పుకొచ్చింది.