Mahesh Babu: మహేష్ బాబు టాక్స్ కట్టకుండా ఎగగొట్టాడా.. ఐటి రైడ్స్ ఎదుర్కొన్నాడా?

Akashavani

Mahesh Babu:టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మొదటి షోతోనే మిశ్రమ స్పందన దక్కించుకుంది.బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో భాగంగా మహేష్ బాబు బ్యాంక్ లోన్ తీసుకున్న తర్వాత రీపేమెంట్ గురించి పెద్ద ఎత్తున క్లాస్ పీకాడు.

ఈ క్రమంలోనే ఈ డైలాగ్ బేస్ చేసుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మహేష్ బాబు గురించి ట్రోల్ చేస్తున్నారు. సాధారణంగా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే వారు తప్పనిసరిగా ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హీరోలు కూడా వారీ రెమ్యూనరేషన్ లో కొంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మహేష్ బాబు గతంలో ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి టాక్స్ చెల్లించలేదు. ఈ క్రమంలోనే గతంలో మహేష్ బాబు ఐటీ రైడ్స్ కూడా ఎదుర్కొన్నారు..

Mahesh Babu: మహేష్ బాబు టాక్స్ కట్టకుండా ఎగగొట్టాడా.. ఐటి రైడ్స్ ఎదుర్కొన్నాడా?
Mahesh Babu: మహేష్ బాబు టాక్స్ కట్టకుండా ఎగగొట్టాడా.. ఐటి రైడ్స్ ఎదుర్కొన్నాడా?

Mahesh Babu: ఐటీ రైడ్స్..

ఇలా మహేష్ బాబు ప్రభుత్వానికి ఈ విధంగా 18.5 లక్షల రూపాయల టాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడంతో అధికారులు రైడ్ చేసినట్టు మనకు తెలిసిందే. ఇలా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా సినిమాలో మాత్రం లోన్ రీపేమెంట్ గురించి క్లాసులు తీసుకోవడంతో చాలామంది ఈ సన్నివేశం పై సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబును పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా విషయంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటించారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది.

- Advertisement -