Dil Raju: దిల్ రాజు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాలతోనూ వాటి రిలీజ్ ఫంక్షన్లతో ఎప్పుడు హడావుడిగా కనిపించే దిల్ రాజు ప్రొఫెషన్ కి ఎంత వాల్యూ ఇస్తారో ఫ్యామిలీకి కూడా అంతే వాల్యూ ఇస్తారు.
బలగం సినిమా ఊహించని విజయాన్ని ఇవ్వటంతో మరింత జోష్ మీద ఉన్నారు దిల్ రాజు. ఇప్పుడు శాకుంతలం ప్రమోషన్స్ కోసం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు అయితే తాజాగా ఈయన శ్రీరామనవమి ఉత్సవాల్లో భార్యతో కొడుకుతో ఆడుతూ పాడుతూ కనిపించి దిల్ రాజు లో మరో కోణం ఉందని నిరూపించారు.
శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణంలో కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మరి పూజలో కూర్చున్నారు దిల్ రాజు. కళ్యాణం పూర్తయిన తర్వాత నవ దంపతులు ఆడుకునే పూబంతతులాటని దిల్ రాజు ఆయన భార్య ఆడటంతో అక్కడ సంతోషకర వాతావరణం నెలకొంది.
కొడుకుని కూడా ఎత్తుకొని ఆడిస్తూ చాలా సంతోషంగా పూర్తిగా దిల్ రాజు లోని మరో మనిషి అక్కడ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ తెగ వైరల్ గా మారింది. ఇప్పుడున్న రోజుల్లో ఒక నిర్మాతగా 10, 20 సినిమాలు తీయటమే చాలా కష్టం.
అలాంటిది 50 సినిమాలు నిర్మించి తన టాలెంట్ ఏంటో చూపించారు దిల్ రాజు. ఆయన కెరియర్ తో పాటు కూతురు హన్సిత లైన్లో పెట్టే పనిలో పడ్డారు దిల్ రాజు. అందులో భాగంగానే రీసెంట్ గా సొంతం చేసుకున్న బలగం సినిమాకి కూతుర్ని నిర్మాతని చేశారు. అటు కెరియర్ని ఇటు ఫ్యామిలీని సమానంగా బ్యాలెన్స్ చేస్తుంటాడు.
Dil Raju:
టైం దొరికినప్పుడు మనవడుతోనో కొడుకుతోనూ సమయాన్ని గడుపుతూ ఒక సక్సెస్ఫుల్ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు దిల్ రాజు. ఇదే వేడుకల్లో బలగం దర్శకుడు వేణు, ఆటో రాంప్రసాద్ వంటి వాళ్లు కూడా పూజలో పాల్గొని సందడి చేశారు.