Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న నిర్మాత దిల్ రాజు. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారారు. వరుసగా చిత్రాలు చేస్తూ అంచలంచలుగా ఎదిగారు. యంగ్ హీరోల దగ్గర్నుంచి ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్ స్టార్స్ వరకు అందరితోనూ భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల దిల్ రాజు హిందీ ఇండస్ట్రీలో కూడా నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి 50వ చిత్రంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్ ఇడియా సినిమాను నిర్మిస్తున్నారు.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. అలాగే, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో ఆయన సంస్థలో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు భారీ చిత్రాలు. అయితే, ఇటీవల కాలంలో దిల్ రాజుకి పెద్దగా సక్సెస్‌లు దక్కడం లేదు. ఈ వారం అక్కినేని నాగ చైతన్య – రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన థాంక్యూ సినిమాను విడుదల చేశారు.
Dil Raju: దిల్ రాజు స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రక్షకుల ముందుకు వచ్చింది. అయితే, చైతూకి లవ్ స్టోరి, బంగార్రాజు సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కాయి. అదే దృష్ఠిలో పెట్టుకొని దిల్ రాజు థాంక్యూ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని ఆశపడ్డాడు. అందుకే, మరీ అత్యత్సాహం చూపించి రిలీజ్ కి ముందురోజు రాత్రే ఏపీలో ప్రీమియర్స్ వేశారు. అక్కడే థాంక్యూ సినిమాకి మైనస్ అయింది. దిల్ రాజు స్ట్రాటజీ వర్కౌట్ కాలేదు. దెబ్బతో నెగిటివ్ టాక్ రావడం భారీ వర్షాలు..ఇవన్నీ కలిసి థాంక్యూ సినిమా అట్టర్ ఫ్లాపవడానికి కారణమయ్యాయి.