Dil Raju: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అంటే అందరికీ బాగా తెలుసు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ ల జాబితాలో ఇతను కూడా ఉన్నాడు. అయితే దిల్ రాజు మొదటిగా డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. అలా ప్రారంభించిన అతను ఎన్నో మంచి చిత్రాలను సినీ ఇండస్ట్రీకి అందించాడు.
ఈ క్రమంలో స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. అంతేకాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా సినిమాలను నిర్మిస్తూ.. భారీ బడ్జెట్ తో సినీ ఇండస్ట్రీకి మంచి సినిమాలను అందిస్తున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అతని వ్యక్తిగత విషయానికొస్తే.. 2017 లో దిల్ రాజు మొదటి భార్య గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
దీంతో కొంతకాలం ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. 2020 లో తేజస్విని అనే అమ్మాయితో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆ అమ్మాయి దిల్ రాజు కంటే చాలా చిన్న వయస్సు గలది. రెండో పెళ్లితో అతను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తన వయసులో సగం వయస్సు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అతనిపై ఎన్నో విమర్శలు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.
అయితే ఎప్పుడు దీనిపై స్పందించిన దిల్ రాజు నేడు తన రెండో పెళ్లి గురించి స్పందించి ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ.. తన భార్య అనిత చనిపోయాక తను రెండేళ్లు మానసికంగా చాలా బాధపడ్డాడు అని చెప్పాడు. ఆ సమయంలో కూతురు అల్లుడు అతనితోనే ఉండేవారని..
ఆ బాధ నుంచి అతను తేరుకోవడానికి చాలా ప్రయత్నించాడనీ.. తనకున్న వ్యాపకం గ్యాంబ్లింగ్ ఒక్కటే అని చెప్పుకొచ్చాడు. అతన్ని అలా చూస్తూ అతని పేరెంట్స్ ఉండలేకపోయారని ఆయన తెలిపాడు. అందుకే వాళ్లే అతనికి రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారని ఆయన చెప్పాడు.
Dil Raju: ఫ్యామిలీ కోసం రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు..
దానికి అతని కూతురు హర్షిత కూడా సపోర్ట్ చేసిందని.. తన ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దనే ఆలోచనతో రెండో పెళ్లి చేసుకున్నాడని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల ఈ దంపతులకి ఓ కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. అయితే అతని ఇద్దరు భార్యల పేర్లు కలిసొచ్చేలాగా అన్వయ్ రెడ్డి అని పేరు పెట్టాడు దిల్ రాజు.