Dil Raju: తెలుగు ప్రేక్షకులకు నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దిల్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి నిర్మాతగా పరిచయం అయిన దిల్ రాజ్ ఆ తర్వాత ఆర్య, భద్ర వంటి పలు సినిమాలను నిర్మించి తెలుగునాట నిర్మాతగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. మొత్తానికి దిల్ రాజ్ టాలీవుడ్ లో అగ్రస్థాయి నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
ఇక ఎఫ్ త్రి సినిమా విడుదల సమయంలో దిల్ రాజ్ ఎక్కువగా సినిమా గురించి ప్రస్తావించలేదు. దాదాపు చాలా వరకు నిర్మాత కష్టాలు, వాళ్ళు వేసే రాంగ్ స్టెప్ లు, ఫేక్ కలెక్షన్ల గురించి మాట్లాడారు. దిల్ రాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని డిస్ట్రిబ్యూటర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ గా లేకపోవడం వల్లనే ప్రస్తుతం మార్కెట్లో అవస్థలు పెరుగుతున్నాయని దిల్ రాజు తెలియజేశాడు.
ఒక సినిమా హిట్ అయితే ఎంత వస్తుంది, ప్లాప్ అయితే ఎంత పోతుంది అన్న విషయం డిస్ట్రిబ్యూటర్ తెలుసుకోవాలని దిల్ రాజ్ తెలిపాడు. ఇక ఈ విషయంలో ప్రొడ్యూసర్ ది ఏ మాత్రం తప్పు ఉండదని వెల్లడించాడు. ఇక చాలామంది ప్రొడ్యూసర్లు నిజమైన పరిస్థితిని గమనించకుండా డబ్బులు పెడుతున్నారని అదే నష్టపోవడానికి కారణం అని తెలిపాడు. ఇక కొంతవరకు నిర్మాత కూడా తప్పు చేస్తున్నాడని తెలిపాడు.

Dil Raju: దిల్ రాజు నిర్మించే సినిమాలకు ఈ విధంగా చేస్తాడట!
నిర్మాత ఒక్క సినిమాకు ఎంత పెట్టాలి అని దగ్గర్నుంచి, ప్రతి షెడ్యూల్ బడ్జెట్ పై చర్చ జరపడం అవసరమని దిల్ రాజ్ ఆరోపించాడు. ఇక సినిమా కొనే విషయంలో డిస్ట్రిబ్యూటర్ ఇది తప్పు, బడ్జెట్ విషయంలో నిర్మాత తప్పు అని అన్నాడు. రెమ్యూనరేషన్ లు బడ్జెట్ ముందుగా నిర్మాత చూసుకోవాలి. నేను నా సినిమాలకు ఒక పది శాతం ఎక్కువే వేసుకుంటాను అని దిల్ రాజ్ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.