Dil Raju: ప్రభాస్ సినిమా నుంచి రకుల్ ని తీసేశాం.. అప్పుడు చాలా బాధేసింది: దిల్ రాజు

Akashavani

Dil Raju: టాలీవుడ్ ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ పై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది.

మొత్తానికి రకుల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. గత కొంత కాలం నుంచి రకుల్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక కంటెంట్ తో సోషల్ మీడియా ప్రియులతో రకుల్ ముచ్చట పెడుతూనే ఉంటుంది.

ఇక తన అందమైన హాట్ పోస్టులను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకొని తన అభిమానులను మెప్పిస్తుంది ఈ అమ్మడి. ఇక ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి మనకు తెలుసు. తాజాగా దిల్ రాజు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ లో మొదట రకుల్ ప్రీత్ సింగ్ అనుకున్నారు కదా.. మరి ఎందుకు కాజల్ ను కన్ఫామ్ చేశారు అన్న ప్రశ్న ఎదురైంది.

Dil Raju: ప్రభాస్ సినిమా నుంచి రకుల్ ని తీసేశాం.. అప్పుడు చాలా బాధేసింది: దిల్ రాజు
Dil Raju: ప్రభాస్ సినిమా నుంచి రకుల్ ని తీసేశాం.. అప్పుడు చాలా బాధేసింది: దిల్ రాజు

Dil Raju: రకుల్ కి బదులుగా దిల్ రాజు కాజల్ ని కన్ఫామ్ చేయడానికి కారణం ఇదే!

దానికి దిల్ రాజు బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలని మొదలుపెట్టాము. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో మొదటిగా రకుల్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసాను. దాదాపు ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాము. కానీ నాకు అంతగా సంతృప్తి అనిపించలేదు. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా అంతా హీరోయిన్ తో బేస్ అయి ఉంటుంది. రకుల్ చాలా సన్నగా ఉంది ఇక అందుకే కాజల్ ని కన్ఫామ్ చేశాం అని దిల్ రాజు వెల్లడించారు.

- Advertisement -