Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత దిల్ రాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మించడమే కాకుండా ఇతర భాషలకు చెందిన సినిమాలను కూడా తన బ్యానర్ లో విడుదల చేస్తున్నాడు. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు పై బాగా విమర్శలు ఎదురవుతుంది.
కారణం ఏంటంటే.. తమిళ్ స్టార్ హీరో విజయ దళపతి నటిస్తున్న వారసుడు సినిమాను సంక్రాంతి సమయంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు పండగల సమయంలో పెద్ద హీరోల సినిమాలు వస్తాయి కానీ డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు రావు అంటూ.. అటువంటిది దిల్ రాజ్ వారసుడు సినిమాను ఎలా తీసుకొస్తున్నాడు అని ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ వివాదం గురించి తాజాగా స్పందించాడు దిల్ రాజ్. తాజాగా మసూద సినిమా సక్సెస్ సందర్భంగా ఆయన పాల్గొనగా అక్కడ కొన్ని విషయాలు పంచుకున్నాడు. మసూద సినిమాపై దర్శకుడికి నమ్మకం బాగా ఉందని.. సినిమా ఎవరికి నచ్చకపోయినా కూడా అంతే ధైర్యంతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు అని అన్నాడు.
ఇక ఆ దర్శకుడి కాన్ఫరెన్స్ తనకు నచ్చిందంటూ అందుకే మద్దతు ఇచ్చానని అన్నాడు. ఇక తన గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటూ.. కానీ తనలో మరో యాంగిల్ ఉందని.. అది ఎవరికి తెలియదు అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. ఇక మంచి కంటెంట్ సినిమాలు తీసే వాళ్ల కోసం తను ఏం చేయడానికి అయినా సిద్ధమే అని అన్నాడు.
Dil Raju: డబ్బులు వద్దంటూ షాకింగ్ కామెంట్ చేసిన దిల్ రాజ్..
మంచి సినిమా వస్తే అది మన వాళ్లకు చూపించాలి అని ఎప్పుడూ ఆలోచిస్తాను అంటూ.. అందుకే లవ్ టుడే సినిమా రిలీజ్ చేస్తున్నాను అని.. ఆ సినిమా పరంగా తనకు ఒక్క రూపాయి కూడా మిగలదు అంటూ.. పైగా తనకు డబ్బులు వద్దంటూ మరో షాకింగ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి.