Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు సినిమాల్లోకి వస్తే కష్టమే.. పెద్దగా అందగా ఏం లేడు!

Akashavani

Akira Nandan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ కంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి కొడుకు, నాగబాబు కొడుకు, అలాగే మెగా మేనల్లులు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇక ఇండస్ట్రీలోకి రావాల్సిందల్లా పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్ మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొడుకు తన వారసత్వాన్ని అందిపుచ్చుకుని త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై తన తల్లి రేణుదేశాయ్ స్పందిస్తూ తాను ఏ విధమైన వంటి సినిమాలు చేయాలనుకోవడం లేదని తెలియజేశారు.ప్రస్తుతం అకీరా తన చదువుపై దృష్టి సారించారని చదువు పూర్తిచేసిన అనంతరం ఇండస్ట్రీలోకి వస్తారంటూ వెల్లడించారు. కానీ మెగా అభిమానులు మాత్రం అకీరా ఎంట్రీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.

 

Akira Nandan: పొడుగు ఉన్నవారు క్లిక్ కాలేరు…

ఇదిలా ఉండగా తాజాగా రెండు రోజుల క్రితం అకీరానందన్ మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసిన విషయాన్ని రేణుదేశాయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ క్రమంలోనే మెగా అభిమానులు ఈ ఘటనపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అకీరా అచ్చం పవన్ కళ్యాణ్ మాదిరిగానే సేవాగుణం కలవారు అంటూ ఆయనని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా కుటుంబం గురించి ఆయన దగ్గర పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే అకీరా ఎంట్రీ గురించి ప్రస్తావన రావడంతో ఈయన పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అకీరా చూడటానికి చాలా పొడుగ్గా ఉన్నాడు,పెద్దగా అందగాడు కాదు ఈయన ఇండస్ట్రీ లోకి వస్తే చాలా కష్టం ఇలాంటి వారు ఇండస్ట్రీలో క్లిక్ కాలేరు అంటూ చెప్పుకొచ్చారు. పొడుగు ఉన్నవారు ఇండస్ట్రీలో క్లిక్ అయిన సందర్భాలు లేవు.ప్రస్తుతం అకీరా చిన్నవయసు కనుక పొడుగ్గా ఉన్నారు. బహుశా అతనికి వయసు వస్తే అందంగా ఉండొచ్చేమో కానీ ప్రస్తుతం పెద్దగా అందంగా లేరు అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -