Director Teja: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రేమ కథ సినిమాలను తెరకెక్కించడంలో ఈయనకు ఎవరు సాటిరారు అని చెప్పాలి.ఇలా ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన తేజ తాజాగా అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా జూన్ రెండో తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ద్వారా ఈయన ఇండస్ట్రీకి దగ్గుబాటి వారసుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నారు.
ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఆయన మరణం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాంకర్ ఉదయ్ కిరణ్ గురించి ఒక్క మాటలో చెప్పమని ప్రశ్నించగా తేజ పాపం అంటూ సమాధానం చెప్పారు.అయితే గతంలో ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ మాట్లాడుతూ తన డెత్ మిస్టరీ తనకు తెలుసు అని చనిపోయేలోపు ఎప్పుడూ ఒకసారి ఆ విషయాన్ని బయట పెడతానని తేజ చెప్పిన విషయం మనకు తెలిసిందే.
Director Teja: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ అందరికీ తెలుసు…
ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి యాంకర్ ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ అందరికీ తెలుసు. కానీ నువ్వే చెప్పాలి అంటూ అందరూ నాటకాలు ఆడుతున్నారని ఈ సందర్భంగా ఈయన ఉదయ్ కిరణ్ మరణం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే హీరో ఉదయ్ కిరణ్ డైరెక్టర్ తేజ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా హీరోగా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.