Director Teja: డైరెక్టర్ తేజ ప్రస్తుతం అహింస సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. దగ్గుబాటి అభిరామ్ ను హీరో ఒక పరిచయం చేస్తూ అహింస అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జూన్ రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో డైరెక్టర్ తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూలలో తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితాల గురించి తేజ మాట్లాడిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన ఆంధ్ర ప్రజల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు ఏమాత్రం సిగ్గులేదని ఆత్మ అభిమానం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ ప్రజలకు ఉద్దేశించి తేజ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర బ్యాంక్ అనేది ఒకటి ఉండేది అయితే ప్రస్తుతం ఈ బ్యాంకు లేదని ఈ బ్యాంకు విషయంలో ఆంధ్రులు ఏమాత్రం పోరాటం చేయలేదని అందుకే తను ఆంధ్ర ప్రజలకు సిగ్గు లేదని మాట్లాడుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
Director Teja: ఆంధ్రులకు ఆత్మాభిమానం లేదు….
ఇప్పటికే మనం పంజాబ్ బ్యాంకులను చూస్తున్నాము. కెనెరా బ్యాంకులను చూస్తున్నాము. కానీ ఆంధ్ర బ్యాంకు మాత్రం లేవని ఈయన ఆవేదన చెందారు.దాదాపు 90 సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ఆంధ్ర బ్యాంకు ను గత మూడు సంవత్సరాల క్రితం యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు.ఇలా ఈ బ్యాంకుని విలీనం చేసే సమయంలో ఏ ఒక్కరు కూడా పోరాటం చేయలేదని ఈ బ్యాంకు విలీనాన్ని ఆపలేదని అందుకే ఆంధ్ర ప్రజలకు ఆత్మ అభిమానం లేదని ఈయన తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రాబ్యాంక్‌ని స్థాపించారు. 1980 లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంక్.. జాతీయ బ్యాంకుగా చేశారు. కానీ 2020 ఏప్రిల్ 1వ తేదీ ఈ బ్యాంకు ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు.ఇలా ఆంధ్ర బ్యాంక్ లేకపోవడం నిజంగానే సిగ్గుచేటు అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.