Divya Bharti : ఆమె అందమే ఆమెని పొట్టన పెట్టుకుంది…!

Bharath Cine Desk

Divya Bharti : దివ్యభారతి ఈ పేరు ఇప్పటి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా కానీ అప్పటి వారికి ఈమె సుపరిచితమే.. శ్రీదేవి బాలీవుడ్ లో రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ లో దివ్యభారతి మోస్ట్ గ్లామరస్ బ్యూటీ గా గుర్తింపు సంపాదించుకుంది. తను ఎలాగో అర్ధాంతరంగా తనువు చాలించిండో… ఈమె కూడా అలానే మరణించింది. తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దివ్యభారతి మరణం పట్ల అప్పట్లో యావత్ తెలుగు ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 90’s లోని యువ కుర్రకారు హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ కి సంబంధించిన మధురానుభూతులు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి.

సినిమాలను రామానాయుడు విభిన్నంగా చిత్ర కరిగించడంలో ఆయన దిట్ట అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైనా కథ నచ్చితే ఖర్చు కోసం అయిన అస్సలు వెనుకాడే వారు కాదు. ప్రేక్షకులకు సినిమాని కళ్ళకు కట్టినట్టు చూపించాలనుకునేవాడు రామానాయుడు… ఈ మేరకు బొబ్బిలి రాజా సినిమా కథ విన్నప్పుడు హీరోయిన్ పాత్ర కోసం ఓ అందమైన నాటి కావాల్సి ఉండే… కానీ అదే సమయానికి దివ్యభారతి రామానాయుడు కంటపడింది. అమె లో ఫ్యూచర్ హోప్ ఆప్ ఇండస్ట్రీ హీరోయిన్ గా రామానాయుడు కి కనిపించింది. బొబ్బిలి రాజా సినిమా బ్లాక్ బస్ట్ అవ్వడం తో ఒక్కసారిగా దివ్యభారతి పేరు మారుమోగింది.

దీంతో ఆనాటి టాప్ హీరోస్ అంతా దివ్య భారతి తో సినిమా చేయాలని తహతహలాడే వారట. ఆమె నటించిన వరుస సినిమాలన్నీ హిట్ కొట్టడంతో.. లక్కీ లేగ్ గా అందరూ భావించేవారు. ఆమెకు తనని శ్రీదేవి తో పోల్చడం చాలా ఇష్టం ఉండేది. ఈమె తెలుగుతోపాటు తమిళ్ మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆయా ఇండస్ట్రీలో కూడా బానే సత్తా చాటడంతో… సౌత్ లో ఆమెకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అయితే దివ్యకి మూవీ హిట్స్ సంతోషాన్ని… ఫ్లాపులూ ఆమెను బాధ పెట్టడం మానేశాయి. జీవితంలో ఇది కాకుండా తనకు ఇంకా ఏదో కావాలనే తపన తో ఆమె క్రమక్రమంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమె పలు సందర్భాల్లో ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉండేది. 1993 ఏప్రిల్ 5 న ఐదో అంతస్తు నుంచి ఆమె దుకీ మరణించింది. అయితే ఆమె మరణం ఇప్పటివరకు మిస్టరీగానే మిగిలిపోయింది.

- Advertisement -