Guess who: జనరల్ గా హీరోయిన్స్ అంటేనే కేవలం అందానికి పరిమితం చేసేసి, వాళ్లకు ఎలాంటి ఇంపార్టెన్స్ లేని పాత్రలను ఇస్తూ ఉంటారు. హీరోయిన్స్ కూడా ఎదో ఒకటిలే అన్నట్టు వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక ఆ మూవీస్ లో యాక్ట్ చేస్తూ ఉంటారు. అయితే 2011 లో వచ్చిన అలా మొదలైంది మూవీలో నిత్యా మీనన్ అనే అమ్మాయి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఆమె తన యాక్టింగ్ టోటల్ ఇండస్ట్రీనే సప్రైజ్ చేసింది. ఆమె మాములుగా సినిమా హీరోయిన్స్ కు ఉండే ఎలాంటి క్వాలిటీస్ లేవు. బట్ స్టిల్ ఆమెను చూడటానికి జనాలు థియేటర్ కు పరుగులు పెట్టారు. ఆమె తన యాక్టింగ్ తో, అభినయంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కట్టిపడేసింది.
నిత్యా మీనన్ 8 ఏప్రిల్ 1988 లో జన్మించారు. ఆమె ప్రధానంగా మలయాళం, తెలుగు మరియు తమిళ చిత్రాలలో పని చేస్తున్నారు.
నిత్యా మీనన్ తన పదేళ్ల వయసులో హనుమాన్ (1998) అనే చిత్రంలో టబు పాత్రకు చెల్లెలుగా నటించింది. 2006లో విడుదలైన కన్నడ చిత్రం 7 ఓ క్లాక్‌లో సహాయ పాత్రలో కనిపించడం ద్వారా ఆమె తన 17 సంవత్సరాల వయస్సులో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె మలయాళంలో ఆకాశ గోపురం (2008), తెలుగులో అలా మొదలైంది (2011) మరియు తమిళంలో నూట్రన్‌బదు (2011)తో, 2019లో మిషన్ మంగళ్‌తో హిందీలో అరంగేట్రం చేసింది.
అవార్డ్స్:
అలా మొదలైంది మూవీకి గాను ఉత్తమ నటిగా నంది అవార్డు పొందారు. గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళి, మళ్ళి ఇది రాణి రోజు మూవీకి గాని ఉత్తమ నటిగా సౌత్ ఫిలిం ఫేర్ అవార్డు ను గెలుచుకున్నారు. ఇలా చాలా అవార్డు ను గెలుచుకున్నారు. ఇప్పటి వరకు నిత్యామీనన్ చేసిన మూవీస్ లో తనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేసింది. తాను అచ్తింగ్ చేసిన మూవీస్ లో ఎంత మంది ఎంత అచ్తింగ్ చేసినా చివరికి అందరికి గుర్తుండిపోయ్యేది మాత్రం నిత్యామీనన్ మాత్రమే. ఇది తాను ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఉంటూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్.