Rajashekar – Jeevitha : హీరో రాజశేఖర్ తెలుసు కదా. తనకు తెలుగు ఇండస్ట్రీలో బాగానే క్రేజ్ ఉంది. రాజశేఖర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. నటుడిగా ఆయన ప్రస్థానం చెప్పుకోదగినదే. ప్రస్తుతం ఆయన సీనియర్ హీరో. సినిమాలంటే ఇష్టం ఉండటం వల్లనే డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కాదు.. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 40 ఏళ్లు అవుతోంది.
ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఆయన జీవితను పెళ్లి చేసుకున్నారు. ఆమె అప్పట్లో హీరోయిన్ గా ఉంది. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులలో వీళ్లు ఒకరు. అయితే.. తాజాగా జీవిత ఓ ఇంటర్వ్యూలో అసలు తను ఎందుకు రాజశేఖర్ ను పెళ్లి చేసుకుందో చెప్పుకొచ్చింది.
Rajashekar – Jeevitha : తలంబ్రాలు అనే సినిమాలో నటించిన జీవిత, రాజశేఖర్
రాజశేఖర్, జీవిత ఇద్దరూ తలంబ్రాలు అనే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి పద్మాలయ స్టూడియోలో చాలా రోజులు సినిమా షూటింగ్ కోసం ఉన్నారు. అప్పుడే రాజశేఖర్ తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారడం, ఆయన్ను అర్థం చేసుకోవడం జరిగింది అంటూ జీవిత చెప్పుకొచ్చారు.
రాజశేఖర్ చాలా ఓపెన్ మైండెడ్. అదే నాకు బాగా నచ్చింది. అందులోనూ అందగాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందరినీ నవ్విస్తారు. చాలా సరదాగా ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోరు. ఈ విషయాలు నచ్చే ఆయన ప్రేమలో పడ్డాను. అయితే.. తనతో ప్రేమలో పడినప్పటికీ ఈ విషయాన్ని జీవిత వెంటనే రాజశేఖర్ కు చెప్పలేదట. ఆ విషయాన్ని గ్రహించిన రాజశేఖర్ తమ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరని జీవితకు చెప్పారట. ఆ తర్వాత ఇంట్లో అన్నీ సర్దుకున్నాయని చెప్పడంతో జీవిత ఆయనకు ప్రపోజ్ చేశారట. ఆ తర్వాత ఇద్దరూ ఏడడుగులు వేశారు. ఇప్పటికీ వాళ్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వాళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఉన్నారు.