Allu Arjun : స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం ఎదిగాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో అన్ని భాషల్లోనూ అల్లు అర్జున్ పేరు సంపాదించుకున్నాడు. అన్ని భాషల్లోనూ అల్లు అర్జున్ క్రేజ్ సంపాదించుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారు.
కానీ ఇప్పుడు అన్ని భాషల్లోనూ అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకొవచ్చు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా క్రేజ్ ఉంది. 8.6 మిలియన్ల మంది ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు కూతురు అర్హ ఫొటోలు, వీడియోలను అభిమానులతో ఆమె పంచుకుంటూ ఉంటుంది. అలాగే డిజైనర్ డ్రెస్సుల్లో ఫొటోషూట్లు చేస్తూ ఆ ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్నేహా జవాబులు ఇచ్చింది. నూతన సంవత్సరంలో కొత్త నిర్ణయం ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా అడిగిన ప్రశ్నకు.. అవాన్ తో కలిసి కిచెన్ లో వంట చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. ఇక ఫేవరేట్ ఫుడ్ ఏంటన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ .. బిర్యానీ ఫొటోలను ఆమె షేర్ చేసింది. ఇండియా వంటకాలంటే చాలా ఇష్టమని స్పష్టం చేసింది.
Allu Arjun :
ఇక ఉదయం ఇష్టమా లేక రాత్రి ఇష్టమా అనే ప్రశ్నకు స్నేహా బదులిస్తూ.. వేకువజాము వేళలు అంటే ఇష్టమని తెలిపింది. అలాగే బన్నీ మీకు పెట్టని నిక్ నేమ్ ఏంటి అని అడగ్గా.. క్యూటీ అని పెట్టినట్లు స్నేహా తెలిపింది.స్నేహా బయటపెట్టిన విషయాలు ఆసక్తికకరంగా మారాయి. అల్లు అర్జున్ కి గురించి, తన ఇష్టాఇష్టాల గురించి సోషల్ మీడియాలో అనేక విషయాలు ఆమె బయటపెడుతుంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది.