Prabhas: యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సోదరుడి కుమారుడిగా తన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఇకపోతే ప్రభాస్ ఈ సినిమాతో పాటు స్పిరిట్, కల్కి వంటి భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ కూడా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ప్రభాస్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు ప్రభాస్ పేరు ప్రభాస్ అని మాత్రమే తెలుసు కానీ ఆయన పూర్తి పేరు ఏంటి అనే విషయాలు చాలా మంది తెలియవు. అయితే తాజాగా ప్రభాస్ ఆధార్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆయన పుట్టిన తేదీ అలాగే ఆయన పూర్తి పేరు కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆధార్ కార్డు ప్రకారం ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. ఇదే ప్రభాస్ పూర్తి పేరు అని ఈ ఆధార్ కార్డు బట్టి తెలుస్తుంది. ఇకపోతే ఈయన పుట్టిన తేదీ విషయానికి వస్తే 23-10-1979 అని ఉంది. దీని ప్రకారం ప్రభాస్ కి ప్రస్తుతం 44 సంవత్సరాల వయసు ఉందని తెలుస్తుంది. ఇక ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం వైరల్ గా మారడంతో ప్రభాస్ సినిమాలలో కన్నా ఆధార్ కార్డులో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.