Venkatesh Seenu Movie : వెంకటేష్ హీరోగా నటించిన శీను మూవీ తెలుసు కదా. ఆ మూవీలో వెంకటేశ్ మూగ వ్యక్తిగా కనిపించాడు. ఆ సినిమా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ తో విడుదల అయింది. అప్పటికే వెంకటేశ్ స్టార్ హీరో. ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయి మంచి ఫామ్ లో ఉన్న సమయంలో తీసిన సినిమా శీను. కానీ.. ఆ సినిమా మాత్రం వెంకటేశ్ కు ఫ్లాప్ ను మిగిల్చింది.
సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా బాక్సాఫీసు వద్ద ఎందుకు ఫ్లాప్ అయింది అంటే దానికి కారణం.. ఆ సినిమా మొత్తం మూగవాడిగా వెంకటేశ్ నటించడం. నిజానికి.. ముందు వెంకటేశ్ మూగవాడు కాదు కానీ.. హీరోయిన్ కోసం అలా నటిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కు అసలు నిజం తెలిసి తన నాలుక కోసేసుకుంటాడు. మూగవాడిగా మారిపోతాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ.. చివర్లో వెంకటేశ్ అలా మూగవాడిగా మారిపోవడం ప్రేక్షకులకు నచ్చలేదు.
Venkatesh Seenu Movie : క్లైమాక్స్ మార్చి ఉంటే సినిమా హిట్ అయ్యేది
ఒకవేళ సినిమా క్లైమాక్స్ మార్చి ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. క్లైమాక్సే ఆ సినిమాకు మైనస్ అయింది. ఆ సినిమా వెంకటేశ్ కెరీర్ కు కూడా మాయని మచ్చలా మిగిలింది. సినిమా క్లైమాక్స్ మార్చి ఉంటే సినిమా హిట్ అయ్యేది అనే విషయం సినిమా రిలీజ్ అయ్యాక మూవీ యూనిట్ కు తెలిసింది. అప్పటికే సినిమా రిలీజ్ అవడం వల్ల క్లైమాక్స్ మార్చే చాన్స్ లేదు కాబట్టి ఇక ఆ సినిమా విషయంలో మూవీ యూనిట్ కూడా ఏం చేయలేకపోయింది. అలా.. వెంకటేశ్ ఖాతాలో ఒక సూపర్ హిట్ కావాల్సిన మూవీ.. ఫ్లాప్ అవ్వాల్సి వచ్చింది.