Esha Gupta: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం రావాలంటే అందచందాలతో పాటు నటన నైపుణ్యం కూడా ఎంతో అవసరం. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది నటీమణులు మరింత అందంగా కనిపించడం కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్లు తీసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున సర్జరీలు కూడా చేయించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీలో దాదాపు చాలా మంది హీరోయిన్స్ ఇలా అందంకోసం సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. ఇకపోతే జన్నత్ 2వెండి తెరకు పరిచయమైన నటి ఇషా గుప్తా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. ఒక నటి అందంగా కనిపించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు.అయితే తనపై కూడా ఇలాంటి ఒత్తిడి ఉందని తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలా మంది నీ ముక్కు చాలా గుండ్రంగా ఉంది షార్ప్ చేయించుకో అని చెప్పేవాళ్ళు.అదేవిధంగా ఫెయిర్ స్కిన్ కోసం ఇంజక్షన్లు వేయించుకొమ్మని సలహాలు కూడా ఇచ్చారని ఈ సందర్భంగా ఈషా గుప్తా వెల్లడించారు.

Esha Gupta: నా కూతురిని నటిగా ఇండస్ట్రీలోకి పంపించను…
నటిగా అందంగా కనిపించడం కోసం కూడా ఇంజెక్షన్లు వేయించుకుంటారా..అని ఆ ఇంజక్షన్ల గురించి ఆరా తీయగా ఒక్కో ఇంజక్షన్ దాదాపు తొమ్మిది వేల రూపాయలు ఉందని ఈమె తెలిపారు.అయితే ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు తమ చర్మం కాంతివంతంగా మెరవడం కోసం ఇలాంటి ఇంజక్షన్లు ఉపయోగిస్తున్నారని ఈమె తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఒక హీరోకు అందంగా కనిపించడం కోసం ఎన్నో ఇబ్బందులను, ఒత్తిడిలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే తన కూతురిని ఇండస్ట్రీలోకి అసలు పంపించనని తన కూతురిని నటిగా కన్నా ఒక క్రీడాకారిణిగా చూడాలన్నదే తన కోరిక అంటూ ఈ సందర్భంగా ఈషా గుప్త పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.