F3 Movie Rating and Review Details
రిలీజ్ డేట్: మే 27, 2022
నటినటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ ఫిర్జాదా, పూజా హెగ్డే, సునీల్, మురళి శర్మ, ప్రగతి, రఘుబాబు తదితరులు నటించారు.
డైరెక్టర్: అనిల్ రావిపూడి
నిర్మాతలు: శిరీష్
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. శిరీష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘F3’. కాగా ఈ రోజు ఈ సినిమా థియేటర్లో విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ: ఇక ఈ సినిమాలో కథ ఎలా ప్రారంభం అవుతుంది అంటే.. లోకంలో పంచభూతాలలో పాటు డబ్బు అనే కోణంతో మరో భూతం ఉంది అన్నట్లుగా ప్రారంభమవుతుంది. ఇందులో వెంకీ (వెంకటేష్), వరుణ్ (వరుణ్ తేజ్) లు తమన్నా, మెహరీన్ లకు భర్తలుగా కనిపించారు. వాళ్లు డబ్బు, బంగారం అంటే ఆశపడే భార్యలుగా కనిపిస్తారు. ఇందులో వెంకటేష్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి ఉంటుంది. ఇక వారి భార్యలకు డబ్బు బాగా సంపాదించడానికి వీరు నానా పాట్లు పడుతుంటారు. దీంతో వెంకటేష్ కు, వరుణ్ తేజ్ కు ఉన్న లోపాలను కవర్ చేస్తూ కనిపిస్తారు. ఇక డబ్బు సంపాదన కోసం వీరు ఏమి చేశారని.. ఆ సమయంలో తమన్నా, మెహరీన్ వీరికి ఎటువంటి సమస్యలు తీసుకువస్తారు అనేది.. చివరికి వీరు ఏమి సాధిస్తారు అనేది మిగిలిన కథ లో చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్: ఈ సినిమా కామెడీ పరంగా ఫుల్ మార్కులు సంపాదించుకుంది. ఇక ఫస్టాఫ్ మొత్తం కామెడీతో సరిపోతుంది. అంతేకాకుండా ఈ సినిమాకు తమ పాత్రలతో బలంగా నిల్చున్నారు వెంకటేష్, వరుణ్ తేజ్. ఇక హీరోయిన్లుగా నటించిన తమన్నా, మెహరీన్ కూడా తమ పాత్రలతో బాగా నవ్వించారు. సినిమాటోగ్రఫీ పరవాలేదు. సంగీత నేపథ్యం బాగుంది. ఈ సినిమా సాంకేతిక పరంగా బాగా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్: సెకండాఫ్ లో ఇంకాస్త ప్రయత్నిస్తే బాగుండు అనిపించింది. సెకండాఫ్ లో కొంత కథ చెప్పడానికి ప్రయత్నించిన కూడా అది అంతగా వర్కవుట్ కాలేదు. ఇక డీఎస్పీ అందించిన మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదు. కథ పరంగా కూడా ఈ సినిమా ఓన్లీ కామెడీ తో సాగిపోవటం తో కాకుండా కాస్త కథ జోడిస్తే బాగుండేది.
సాంకేతిక విభాగం: ఫుల్ కామెడీతో అనిల్ రావిపూడి మంచి సక్సెస్ ను అందించుకున్నాడు. సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. డీఎస్పీ సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మిగిలిన టెక్నీషియన్ భాగాలు పర్వాలేదు. వాటి అవసరాలకు అనుగుణంగా మిగిలిన విభాగాలు పని చేశాయి.
చివరి మాట: ఈ సినిమాను కథ కోసం కాకుండా కామెడీ కోసం మాత్రం చూడవచ్చని చెప్పవచ్చు. నిజానికి డైరెక్టర్ ఈ సినిమాను కామెడీ ప్రేక్షకుల కోసమే తీశాడు అన్నట్లుగా అనిపిస్తుంది. దీంతో కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.