Faima: పటాస్ కార్యక్రమం ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైనటువంటి ఫైమా అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశాలను అందుకున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడీయన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఇలా స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలు ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె భారీ స్థాయిలో డబ్బు సంపాదిస్తున్నారని చెప్పాలి.ఒకప్పుడు కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ బ్రతికినటువంటి ఫైమా ఇండస్ట్రీలోకి వచ్చి తన నటనతో అందరిని మెప్పించడమే కాకుండా వరుస అవకాశాలు అందుకుంటూ భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. వీరు అక్క చెల్లెలు ముగ్గురు కాగా భారీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తన తల్లి బీడీలు చుడుతూ తమని పెంచి పెద్ద చేసిందని ఫైమా ఎన్నోసార్లు తమ కష్టాలను తెలియజేశారు.
Faima: సొంత ఇల్లు కారు కొన్న ఫైమా…
తన తల్లికి పెద్ద కోరికలు ఏమీ లేవని ఎప్పటికైనా ఉండటానికి సొంత ఇల్లు ఉండాలనేది తన కోరిక అంటూ తెలిపారు. అయితే తన తల్లి కల నెరవేర్చడం కోసం ఫైమా ఎంతో కష్టపడ్డారు.అనుకున్న విధంగానే తన తల్లి కష్టాలను తీర్చడమే కాకుండా తన తల్లి కోరికను కూడా నెరవేస్తూ సొంత ఇంటిని కారును కొనుగోలు చేశారు. ఇలా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతూ ఈమె దాదాపు కోటి రూపాయల వరకు ఆస్తులను సంపాదించారని తెలుస్తుంది.